Muslim99Muslim99
← Tafsir library

4. An-Nisaa

The Women · Medinan · 176 ayahs

سُورَةُ النِّسَاءِ

Reading Al-Mukhtasar in Interpreting the Noble Qur'an by Tafsir Center for Quranic Studies

Ayahs 1–10 of 176

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ

1

يَٰٓأَيُّهَا ٱلنَّاسُ ٱتَّقُوا۟ رَبَّكُمُ ٱلَّذِى خَلَقَكُم مِّن نَّفْسٍۢ وَٰحِدَةٍۢ وَخَلَقَ مِنْهَا زَوْجَهَا وَبَثَّ مِنْهُمَا رِجَالًۭا كَثِيرًۭا وَنِسَآءًۭ ۚ وَٱتَّقُوا۟ ٱللَّهَ ٱلَّذِى تَسَآءَلُونَ بِهِۦ وَٱلْأَرْحَامَ ۚ إِنَّ ٱللَّهَ كَانَ عَلَيْكُمْ رَقِيبًۭا

O mankind, fear your Lord, who created you from one soul and created from it its mate and dispersed from both of them many men and women. And fear Allah, through whom you ask one another, and the wombs. Indeed Allah is ever, over you, an Observer.

ఓ ప్రజలారా!మీ ప్రభువుకి భయపడండి,ఆయనే మిమ్మల్ని ఒక ప్రాణం నుండి సృష్టించాడు,ఆయనే మీ తండ్రి ఆదమ్,మరియు అతని నుండి తన భార్యని సృష్టించాడు,ఆమె మీ తల్లి హవ్వా!వారిరువురి ద్వారా భూమండలంకు నలువైపుల మగ,ఆడ మానవులను వ్యాపింపజేశాడు,మరియు మీరు అల్లాహ్ కు భయపడండి ఆయన పేరుతోనే మీరు ఒకరినొకరు ప్రశ్నించుకుంటారు,మీరు ఇలా అంటారు:-అల్లాహ్ పేరుతో అడుగుతున్నాను నీవు ఇలా చేయి,మీ మధ్య జోడించబడిన బంధాలను తెగత్రెంపులు చేసుకోవడానికి భయపడండి’నిశ్చయంగా అల్లాహ్ ఎల్లప్పుడు మిమ్మల్ని గమనిస్తూ ఉంటాడు,మీ కర్మల నుండి ఏ విషయం వ్యర్ధమవ్వదు,బదులుగా వాటిని లెక్కించి ఉంచుతాడు మరియు వాటి ప్రతిఫలాన్ని మీకు ఇస్తాడు.

2

وَءَاتُوا۟ ٱلْيَتَٰمَىٰٓ أَمْوَٰلَهُمْ ۖ وَلَا تَتَبَدَّلُوا۟ ٱلْخَبِيثَ بِٱلطَّيِّبِ ۖ وَلَا تَأْكُلُوٓا۟ أَمْوَٰلَهُمْ إِلَىٰٓ أَمْوَٰلِكُمْ ۚ إِنَّهُۥ كَانَ حُوبًۭا كَبِيرًۭا

And give to the orphans their properties and do not substitute the defective [of your own] for the good [of theirs]. And do not consume their properties into your own. Indeed, that is ever a great sin.

మరియు ఇవ్వండి-ఓ సంరక్షకులారా-అనాథలకు (తమ తండ్రులను కోల్పోయిన యుక్తవయస్సుకు చేరని బాలకులు)వారి పూర్తి సంపదను,యుక్తవయస్సుకు చేరి వివేకులైన తరువాత,-మరియు ఆనాధాల యొక్క సంపదలో అత్యుత్తమ సొమ్మును మీరు తీసుకుని వారికి మీ హీనమైన చెడిపోయిన డబ్బును ఇస్తూ హరామును హలాలుగా మార్చుకోవద్దు.మరియు మీ డబ్బుతో కలిపి అనాధాల డబ్బును తీసుకోవద్దు,నిశ్చయంగా ఇది అల్లాహ్ దృష్టిలో మహాపెద్ద పాపం.

3

وَإِنْ خِفْتُمْ أَلَّا تُقْسِطُوا۟ فِى ٱلْيَتَٰمَىٰ فَٱنكِحُوا۟ مَا طَابَ لَكُم مِّنَ ٱلنِّسَآءِ مَثْنَىٰ وَثُلَٰثَ وَرُبَٰعَ ۖ فَإِنْ خِفْتُمْ أَلَّا تَعْدِلُوا۟ فَوَٰحِدَةً أَوْ مَا مَلَكَتْ أَيْمَٰنُكُمْ ۚ ذَٰلِكَ أَدْنَىٰٓ أَلَّا تَعُولُوا۟

And if you fear that you will not deal justly with the orphan girls, then marry those that please you of [other] women, two or three or four. But if you fear that you will not be just, then [marry only] one or those your right hand possesses. That is more suitable that you may not incline [to injustice].

మరియు మీ సంరక్షణలో ఉన్న అనాథలను వివాహం చేసుకుంటే న్యాయం చేయలేరని మీరు భయపడినా లేదా వారికి తప్పనిసరిగా చెల్లించాల్సిన‘మహార్’మూల్యం చెల్లించే విషయంలో భయంకలిగిన లేదా వారి పట్ల దుర్వినియోగం జరుగుతుందనే భయం కలిగిన,వారిని వదిలేయండి,మరియు ఇతర ఉత్తమ స్త్రీలను ఎంచుకుని వివాహమాడండి,ఒకవేళ మీరు కోరితే ఇద్దరినీ,ముగ్గురిని,లేదా నలుగురిని వివాహమాడవచ్చు,కానీ వారిమధ్య న్యాయం చెయలేనని ఒకవేళ భయపడితే ‘ఒకరి’తో సరిపెట్టుకోండి,లేదా మీ అధికారంలో ఉన్న బానిస స్త్రీలతో కాపురంచేయండి, ఎందుకంటే వారికి మీ భార్యలతో పోలిన సమానమైన హక్కులు లేవు,ఈ ఆయతులో అనాథలకు సంబంధించిన విషయాలు ప్రస్తావించబడ్డాయి మరియు ఒకరితో వివాహం లేదా బానిస-అమ్మాయి’తో తృప్తి చెందమని పరిమితి చేయబడింది, ఇది మీరు మోసపోకుండా మరియు నిషేధాలకు పాల్పడకుండా చేస్తుంది.

4

وَءَاتُوا۟ ٱلنِّسَآءَ صَدُقَٰتِهِنَّ نِحْلَةًۭ ۚ فَإِن طِبْنَ لَكُمْ عَن شَىْءٍۢ مِّنْهُ نَفْسًۭا فَكُلُوهُ هَنِيٓـًۭٔا مَّرِيٓـًۭٔا

And give the women [upon marriage] their [bridal] gifts graciously. But if they give up willingly to you anything of it, then take it in satisfaction and ease.

స్త్రీలకు వారి మహార్ మూల్యాన్నితప్పనిసరిగా విధిగా చెల్లించండి,ఒకవేళ వారు తమకోసం మరేదైనా వస్తువును బలవంతం లేకుండా మీకోసం తృప్తి చెందితే అలాంటప్పుడు మీరు హలాలును నిరబ్యంతరంగా తినండి,అందులో మొహమాటపడకండి.

5

وَلَا تُؤْتُوا۟ ٱلسُّفَهَآءَ أَمْوَٰلَكُمُ ٱلَّتِى جَعَلَ ٱللَّهُ لَكُمْ قِيَٰمًۭا وَٱرْزُقُوهُمْ فِيهَا وَٱكْسُوهُمْ وَقُولُوا۟ لَهُمْ قَوْلًۭا مَّعْرُوفًۭا

And do not give the weak-minded your property, which Allah has made a means of sustenance for you, but provide for them with it and clothe them and speak to them words of appropriate kindness.

మీరు ఇవ్వవద్దు-ఓ సంరక్షకులారా-డబ్బును ఉత్తమంగా వినియోగించడం రాకపోతే ,ఈ సంపదలను అల్లాహ్ ఒక కారణంగా చేశాడు వీటి ద్వారా దాసుల ప్రయోజనాలు మరియు వారి జీవిత వ్యవహారాలు కొనసాగుతాయి,కాబట్టి ఇలాంటి వారు సంపద మరియు దాని సంరక్షణకై అర్హులు కారు,వారిపై ఖర్చుచేయండి మరియు అందులో నుంచి వస్త్రధారణ చేయండి,మరియు వారితో మృదువుగా సంభాషించండి,మరియు మంచిగా ఉపదేశిస్తూ వారు వివేకానికి చేరుకోగానే,ఖర్చు చేసే తెలివి రాగానే ఇస్తాము అని చెప్పండి.

6

وَٱبْتَلُوا۟ ٱلْيَتَٰمَىٰ حَتَّىٰٓ إِذَا بَلَغُوا۟ ٱلنِّكَاحَ فَإِنْ ءَانَسْتُم مِّنْهُمْ رُشْدًۭا فَٱدْفَعُوٓا۟ إِلَيْهِمْ أَمْوَٰلَهُمْ ۖ وَلَا تَأْكُلُوهَآ إِسْرَافًۭا وَبِدَارًا أَن يَكْبَرُوا۟ ۚ وَمَن كَانَ غَنِيًّۭا فَلْيَسْتَعْفِفْ ۖ وَمَن كَانَ فَقِيرًۭا فَلْيَأْكُلْ بِٱلْمَعْرُوفِ ۚ فَإِذَا دَفَعْتُمْ إِلَيْهِمْ أَمْوَٰلَهُمْ فَأَشْهِدُوا۟ عَلَيْهِمْ ۚ وَكَفَىٰ بِٱللَّهِ حَسِيبًۭا

And test the orphans [in their abilities] until they reach marriageable age. Then if you perceive in them sound judgement, release their property to them. And do not consume it excessively and quickly, [anticipating] that they will grow up. And whoever, [when acting as guardian], is self-sufficient should refrain [from taking a fee]; and whoever is poor - let him take according to what is acceptable. Then when you release their property to them, bring witnesses upon them. And sufficient is Allah as Accountant.

ఓ అనాధాల -సంరక్షకులారా-వారు ప్రాజ్ఞ వయస్సుకు చేరిన తరువాత వారి డబ్బులోంచి కొంతభాగాన్ని పరీక్ష నిమిత్తం వినియోగించడానికి ఇవ్వండి ఒకవేళ వారు దాన్ని ఉత్తమంగా ఉపయోగించినట్లైతే వారి తెలివి,వివేకాలు మీకు అర్ధమైనట్లైతే అలాంటివారి పూర్తి సంపదను ఏ మాత్రం తగ్గించకుండా వారికి అప్పచెప్పండి,అల్లాహ్ మీకు వారి డబ్బులో అవసరార్ధం అనుమతిచ్చిన దాన్ని మినహాయించి హద్దుమీరీ తినకండి,ప్రాజ్ఞ వయసుకు రాగానే వారు దాన్ని తీసుకుంటారన్న భయంతో తినడంలో మితిమీరకండి,మీలో ఎవరైతే డబ్బు అవసరం లేని ధనికులు ఉన్నారో వారు అనాధల సొమ్మును తినకండి,మరెవరైతే మీలో డబ్బులేని పేదవాడుగా ఉంటాడో అవసరానికి సరిపోయేంత తినండి,మీరు వారికి యుక్తవయస్సుకు వచ్చాక మరియు వారి తెలివితేటలు మీ ముందు స్పష్టమయ్యాక డబ్బు అప్పచెప్పండి అలా అప్పగించేటప్పుడు హక్కులను పరిరక్షించేందుకు,మరియు విభేదాలు ఏర్పడకుండా సాక్ష్యులను దానిపై నియమించండి,అల్లాహ్’యే దానికి సాక్షిగా మరియు దాసుల కార్యాలకు లెక్కచూసేందుకు సరిపోతాడు.

7

لِّلرِّجَالِ نَصِيبٌۭ مِّمَّا تَرَكَ ٱلْوَٰلِدَانِ وَٱلْأَقْرَبُونَ وَلِلنِّسَآءِ نَصِيبٌۭ مِّمَّا تَرَكَ ٱلْوَٰلِدَانِ وَٱلْأَقْرَبُونَ مِمَّا قَلَّ مِنْهُ أَوْ كَثُرَ ۚ نَصِيبًۭا مَّفْرُوضًۭا

For men is a share of what the parents and close relatives leave, and for women is a share of what the parents and close relatives leave, be it little or much - an obligatory share.

తల్లిదండ్రులు మరియు సమీపబంధువులు అంటే అన్నదమ్ములు,మరియు మేనమామలు,మరణించిన తరువాత పురుషుల కొరకు అందులో వాటా ఉంది అది తక్కువ లేదా ఎక్కువ కావచ్చు,మరియు వీరంతా వదిలి వెళ్ళిన ఆస్తిలో స్త్రీలకు కూడా -అజ్ఞాన కాలానికి భిన్నంగా-వాటా ఉంటుంది, ఆ కాలంలో స్త్రీలకు మరియు చిన్నపిల్లలకు ఆస్తిహక్కు ఉండేది కాదు,ఈ వాటాలు స్పష్టమైనవి సత్యమైనవి,ఈ వాటాలు అల్లాహ్ తరుపునుండి విధి చేయబడినవి.

8

وَإِذَا حَضَرَ ٱلْقِسْمَةَ أُو۟لُوا۟ ٱلْقُرْبَىٰ وَٱلْيَتَٰمَىٰ وَٱلْمَسَٰكِينُ فَٱرْزُقُوهُم مِّنْهُ وَقُولُوا۟ لَهُمْ قَوْلًۭا مَّعْرُوفًۭا

And when [other] relatives and orphans and the needy are present at the [time of] division, then provide for them [something] out of the estate and speak to them words of appropriate kindness.

ఆస్తిపంపకాల సమయంలో వారసత్వ వాటా లేని సమీపబందువులు,అనాధలు మరియు పేదలు హాజరైనప్పుడు ఈ డబ్బు విభజనకి ముందు మీ మదిని ఆహ్లాదపర్చడానికి ప్రేమపూర్వకంగా ఇవ్వండి,వారు దానిని కోరుకుంటారు,నిశ్చయంగా వారు మీ వద్దకు కష్టపడి వచ్చారు,వారితో ఉత్తమంగా సంభాషించండి,కసురుకోకండి.

9

وَلْيَخْشَ ٱلَّذِينَ لَوْ تَرَكُوا۟ مِنْ خَلْفِهِمْ ذُرِّيَّةًۭ ضِعَٰفًا خَافُوا۟ عَلَيْهِمْ فَلْيَتَّقُوا۟ ٱللَّهَ وَلْيَقُولُوا۟ قَوْلًۭا سَدِيدًا

And let those [executors and guardians] fear [injustice] as if they [themselves] had left weak offspring behind and feared for them. So let them fear Allah and speak words of appropriate justice.

తమ బలహీనమైన చిన్నపిల్లలను వారసులుగా విడిచిపెట్టి వెళ్ళినట్లైతే వారు వృధాగా అవుతారని భయపడతారు (భయపడాలి) అలాగే వారి సంరక్షణలో ఉన్న అనాథలకు అన్యాయం చేయకుండా దేవునికి భయపడాలి తద్వారా వారి మరణాంతరం వారి పిల్లలకు వీరు మంచి చేసినట్లు అన్యాయం చేయని వారిని అల్లాహ్ నియమించి వారికి సులభతరం చేశాడు. మరియు వసియత్ సమయంలో హాజరు అయ్యే వారి సంతానముతో మంచిగా వ్యవహరించి వారితో న్యాయపరంగా మాట్లాడండి,వసియత్ వలన వారసుల హక్కులో అన్యాయం చేయకండి, వసియత్ పై అమలు చేయటం వదిలివేసి తమపై కలిగే మంచిని కోల్పోకండి.

10

إِنَّ ٱلَّذِينَ يَأْكُلُونَ أَمْوَٰلَ ٱلْيَتَٰمَىٰ ظُلْمًا إِنَّمَا يَأْكُلُونَ فِى بُطُونِهِمْ نَارًۭا ۖ وَسَيَصْلَوْنَ سَعِيرًۭا

Indeed, those who devour the property of orphans unjustly are only consuming into their bellies fire. And they will be burned in a Blaze.

అనాథల డబ్బును తీసుకుని అందులో అన్యాయంగా అక్రమంగా ఖర్చు చేసినవారు,నిశ్చయంగా వారి కడుపులను అగ్నితో నింపుతున్నారు అది వారిపై ఎగిసిపడుతుంది,మరియు త్వరలో నరకాగ్ని వారిని పరలోకంలో కాల్చివేస్తుంది.

Commentary: Al-Mukhtasar in Interpreting the Noble Qur'an by Tafsir Center for Quranic Studies. Qur'an text and translation via AlQuran Cloud.