Muslim99Muslim99
← Tafsir library

16. An-Nahl

The Bee · Meccan · 128 ayahs

سُورَةُ النَّحۡلِ

Reading Al-Mukhtasar in Interpreting the Noble Qur'an by Tafsir Center for Quranic Studies

Ayahs 101–110 of 128

101

وَإِذَا بَدَّلْنَآ ءَايَةًۭ مَّكَانَ ءَايَةٍۢ ۙ وَٱللَّهُ أَعْلَمُ بِمَا يُنَزِّلُ قَالُوٓا۟ إِنَّمَآ أَنتَ مُفْتَرٍۭ ۚ بَلْ أَكْثَرُهُمْ لَا يَعْلَمُونَ

And when We substitute a verse in place of a verse - and Allah is most knowing of what He sends down - they say, "You, [O Muhammad], are but an inventor [of lies]." But most of them do not know.

మరియు మేము ఖుర్ఆన్ లో ఏదైన ఆయతు ఆదేశమును రద్దుపరచి దానికి బదులుగా వేరే ఆయతును తీసుకుని వచ్చినప్పుడు - ఖుర్ఆన్ లో రద్దుపరచబడిన వాటి గురించి అల్లాహ్ కి బాగా తెలుసు - వారు అంటారు : ఓ ముహమ్మద్ నీవు కేవలం అల్లాహ్ కి వ్యతిరేకంగా కల్పించుకుంటున్నావు,అబధ్ధం పలుకుతున్నావు. కానీ రద్దుపరచటం అన్నది దైవ సంపూర్ణ వివేకం వలన అవుతుందన్న విషయం చాలామందికి తెలియదు.

An-Nahl 16:101Listen in Qur'an →
102

قُلْ نَزَّلَهُۥ رُوحُ ٱلْقُدُسِ مِن رَّبِّكَ بِٱلْحَقِّ لِيُثَبِّتَ ٱلَّذِينَ ءَامَنُوا۟ وَهُدًۭى وَبُشْرَىٰ لِلْمُسْلِمِينَ

Say, [O Muhammad], "The Pure Spirit has brought it down from your Lord in truth to make firm those who believe and as guidance and good tidings to the Muslims."

ఓ ప్రవక్తా వారితో ఇలా పలకండి : జిబ్రయీల్ అలైహిస్సలాం ఈ ఖుర్ఆన్ ను పరిశుద్ధుడైన అల్లాహ్ వద్ద నుండి సత్యముతో తీసుకుని వచ్చారు. అందులో ఎటువంటి తప్పుగాని,మార్పు,చేర్పులు గాని లేవు. ఎప్పుడైన ఆయన వద్ద నుండి ఏదైన కొత్తది తీసుకుని వచ్చినా,ఆయన వద్ద నుండి ఏదైన ఖండించబడినా అల్లాహ్ పట్ల విశ్వాసమును కలిగిన వారు తమ విశ్వాసముపై నిలకడగా ఉండటానికి,వారికి సత్యము వైపునకు మార్గదర్శకము అవటానికి,ముస్లిముల కొరకు దానిపై వారు ఏదైతే ఉన్నత పుణ్యమును పొందుతారో దాని శుభవార్త ఇవ్వటానికి.

An-Nahl 16:102Listen in Qur'an →
103

وَلَقَدْ نَعْلَمُ أَنَّهُمْ يَقُولُونَ إِنَّمَا يُعَلِّمُهُۥ بَشَرٌۭ ۗ لِّسَانُ ٱلَّذِى يُلْحِدُونَ إِلَيْهِ أَعْجَمِىٌّۭ وَهَٰذَا لِسَانٌ عَرَبِىٌّۭ مُّبِينٌ

And We certainly know that they say, "It is only a human being who teaches the Prophet." The tongue of the one they refer to is foreign, and this Qur'an is [in] a clear Arabic language.

మరియు ముష్రికులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఖుర్ఆన్ నేర్పిస్తున్నది ఒక మనిషి అని చెబుతున్న విషయం మాకు తెలుసు. వారు తమ వాదనలో అబధ్ధం చెబుతున్నారు. ఆయనకు నేర్పిస్తున్నాడని వారు వాదిస్తున్న వ్యక్తి భాష అరబీ కాదు (అజమీ). ఈ ఖుర్ఆన్ గొప్ప అర్ధము కల స్పష్టమైన అరబీ భాషలో అవతరింపబడినది. అలాంటప్పుడు ఆయన ఒక అరబేతరుడితో దాన్ని నేర్చుకున్నాడని మీరు ఎలా వాదిస్తున్నారు ?.

An-Nahl 16:103Listen in Qur'an →
104

إِنَّ ٱلَّذِينَ لَا يُؤْمِنُونَ بِـَٔايَٰتِ ٱللَّهِ لَا يَهْدِيهِمُ ٱللَّهُ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ

Indeed, those who do not believe in the verses of Allah - Allah will not guide them, and for them is a painful punishment.

నిశ్చయంగా ఎవరైతే అల్లాహ్ ఆయతులను పరిశుద్ధుడైన ఆయన వద్దనుండి వచ్చినవని విశ్వసించరో వారికి అల్లాహ్ వారు ఎప్పటి వరకు దానిపై మొండిగా ఉంటారో అప్పటి వరకు సన్మార్గము కొరకు సౌభాగ్యమును కలిగించడు. వారికి ఉన్న అల్లాహ్ పై అవిశ్వాసము,ఆయన ఆయతుల పట్ల తిరస్కారము వలన వారి కొరకు బాధాకరమైన శిక్ష కలదు.

An-Nahl 16:104Listen in Qur'an →
105

إِنَّمَا يَفْتَرِى ٱلْكَذِبَ ٱلَّذِينَ لَا يُؤْمِنُونَ بِـَٔايَٰتِ ٱللَّهِ ۖ وَأُو۟لَٰٓئِكَ هُمُ ٱلْكَٰذِبُونَ

They only invent falsehood who do not believe in the verses of Allah, and it is those who are the liars.

ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన ప్రభువు వద్ద నుండి తీసుకుని వచ్చిన విషయంలో అబధ్ధపరులు కారు.అల్లాహ్ ఆయతులను విశ్వసించనివారు అబధ్ధమును కల్పిస్తున్నారు. ఎందుకంటే వారికి శిక్ష భయం లేదు. ప్రతిఫలమును ఆశించటం లేదుమరియు అవిశ్వాస గుణము కలిగిన వారందరు అసత్యపరులు. ఎందుకంటే అబధ్ధము వారి అలవాటు.

An-Nahl 16:105Listen in Qur'an →
106

مَن كَفَرَ بِٱللَّهِ مِنۢ بَعْدِ إِيمَٰنِهِۦٓ إِلَّا مَنْ أُكْرِهَ وَقَلْبُهُۥ مُطْمَئِنٌّۢ بِٱلْإِيمَٰنِ وَلَٰكِن مَّن شَرَحَ بِٱلْكُفْرِ صَدْرًۭا فَعَلَيْهِمْ غَضَبٌۭ مِّنَ ٱللَّهِ وَلَهُمْ عَذَابٌ عَظِيمٌۭ

Whoever disbelieves in Allah after his belief... except for one who is forced [to renounce his religion] while his heart is secure in faith. But those who [willingly] open their breasts to disbelief, upon them is wrath from Allah, and for them is a great punishment;

ఎవరైతే అల్లాహ్ పై విశ్వాసము తరువాత అల్లాహ్ పట్ల అవిశ్వాసముతో నిండిన హృదయమును కలిగి ఉండి దాన్ని విశ్వాసమునకు విరుద్ధంగా ఎంచుకుని ఉండి ఇష్టపూర్వకంగా దాన్ని పలికితే అతను ఇస్లాం నుండి మరలిపోతాడు. ఇలాంటి వారిపై అల్లాహ్ వద్ద నుండి ఆగ్రహం వచ్చి పడుతుంది. మరియు వారికి పెద్ద శిక్ష ఉన్నది. కాని ఎవరైతే విశ్వాసము యొక్క వాస్తవికతను నమ్ముతూ అతని హృదయం విశ్వాసముతో సంతృప్తి చెంది ఉండి బలవంతాన తన నోటితో అవిశ్వాస మాటలు పలికితే (అతడు ఇస్లాంలోనే ఉంటాడు) .

An-Nahl 16:106Listen in Qur'an →
107

ذَٰلِكَ بِأَنَّهُمُ ٱسْتَحَبُّوا۟ ٱلْحَيَوٰةَ ٱلدُّنْيَا عَلَى ٱلْءَاخِرَةِ وَأَنَّ ٱللَّهَ لَا يَهْدِى ٱلْقَوْمَ ٱلْكَٰفِرِينَ

That is because they preferred the worldly life over the Hereafter and that Allah does not guide the disbelieving people.

ఇస్లాం నుండి ఈ మరలిపోవటం అన్నది వారు తమ అవిశ్వాసం వలన పరలోకమునకు బదులుగా ఇహలోక శిధిలాలను పొందటం వలన జరిగినది. మరియు అల్లాహ్ అవిశ్వాసపరులైన జాతి వారికి విశ్వాసమును అనుగ్రహించడు. కాని వారిని పరాభవమునకు గురి చేస్తాడు.

An-Nahl 16:107Listen in Qur'an →
108

أُو۟لَٰٓئِكَ ٱلَّذِينَ طَبَعَ ٱللَّهُ عَلَىٰ قُلُوبِهِمْ وَسَمْعِهِمْ وَأَبْصَٰرِهِمْ ۖ وَأُو۟لَٰٓئِكَ هُمُ ٱلْغَٰفِلُونَ

Those are the ones over whose hearts and hearing and vision Allah has sealed, and it is those who are the heedless.

విశ్వాసము తరువాత మరలిపోయే గుణం కల వీరందరి హృదయములపై అల్లాహ్ ముద్ర వేశాడు. అయితే వారు హితబోధనలను అర్ధం చేసుకోరు. వారి చెవులపై వేశాడు వాటి ద్వారా వారు ప్రయోజనం కలిగించే వాటిని విన లేరు. వారి కళ్ళపై వేశాడు అయితే వారు విశ్వాసము పై సూచించే సూచనలను చూడలేరు. మరియు వారందరు సుఖ,దుఃఖాల కారకాల నుండి మరియు అల్లాహ్ వారి కొరకు తయారు చేసి ఉంచిన శిక్ష నుండి పరధ్యానంలో ఉన్నారు.

An-Nahl 16:108Listen in Qur'an →
109

لَا جَرَمَ أَنَّهُمْ فِى ٱلْءَاخِرَةِ هُمُ ٱلْخَٰسِرُونَ

Assuredly, it is they, in the Hereafter, who will be the losers.

వాస్తవానికి నిశ్చయంగా వారు ప్రళయదినాన విశ్వాసము తరువాత తమ అవిశ్వాసం వలన స్వయంగా నష్టపోతారు. ఒక వేళ వారు తమ మొదటి విశ్వాసముపై ఉండి ఉంటే స్వర్గములో ప్రవేశించి ఉండేవారు.

An-Nahl 16:109Listen in Qur'an →
110

ثُمَّ إِنَّ رَبَّكَ لِلَّذِينَ هَاجَرُوا۟ مِنۢ بَعْدِ مَا فُتِنُوا۟ ثُمَّ جَٰهَدُوا۟ وَصَبَرُوٓا۟ إِنَّ رَبَّكَ مِنۢ بَعْدِهَا لَغَفُورٌۭ رَّحِيمٌۭ

Then, indeed your Lord, to those who emigrated after they had been compelled [to renounce their religion] and thereafter fought [for the cause of Allah] and were patient - indeed, your Lord, after that, is Forgiving and Merciful

ఆ తరువాత ఓ ప్రవక్తా నిశ్చయంగా నీ ప్రభువు ఆ బలహీన విశ్వాసపరులను క్షమించేవాడును,కరుణించేవాడును ఎవరైతే ముష్రికుల చేతుల్లో బాధించబడిన తరువాత మక్కా నుండి మదీనాకి హిజ్రత్ చేసి వెళ్లిపోయారో. వారు (ముష్రికులు) వారి ధర్మ విషయంలో పీడిస్తే వారు చివరకు వారి హృదయములు విశ్వాసముతో సంతృప్తి చెంది ఉండి, వారు అవిశ్వాసపలుకులు పలికారు,ఆ పిదప అల్లాహ్ వాక్కు గొప్పదవటానికి,అవిశ్వాసపరుల వాక్కు నేలమట్టం అవటానికి అల్లాహ్ మార్గంలో పోరాడి,దానిలో కలిగే కష్టాల్లో సహనం చూపించారు. నిశ్చయంగా నీ ప్రభువు వాడు పీడించబడిన ఈ పీడన తరువాత,వారు బాధించబడి చివరికి అవిశ్వాస పలుకును పలికిన బాధ తరువాత వారిని మన్నించే వాడును,వారిపై కనికరించే వాడును.ఎందుకంటే వారు అవిస్వాసపలుకులను బలవంతాన మాత్రమే పలికారు.

An-Nahl 16:110Listen in Qur'an →

Commentary: Al-Mukhtasar in Interpreting the Noble Qur'an by Tafsir Center for Quranic Studies. Qur'an text and translation via AlQuran Cloud.