Muslim99Muslim99
← Tafsir library

16. An-Nahl

The Bee · Meccan · 128 ayahs

سُورَةُ النَّحۡلِ

Reading Al-Mukhtasar in Interpreting the Noble Qur'an by Tafsir Center for Quranic Studies

Ayahs 91–100 of 128

91

وَأَوْفُوا۟ بِعَهْدِ ٱللَّهِ إِذَا عَٰهَدتُّمْ وَلَا تَنقُضُوا۟ ٱلْأَيْمَٰنَ بَعْدَ تَوْكِيدِهَا وَقَدْ جَعَلْتُمُ ٱللَّهَ عَلَيْكُمْ كَفِيلًا ۚ إِنَّ ٱللَّهَ يَعْلَمُ مَا تَفْعَلُونَ

And fulfill the covenant of Allah when you have taken it, [O believers], and do not break oaths after their confirmation while you have made Allah, over you, a witness. Indeed, Allah knows what you do.

మరియు మీరు అల్లాహ్ కు చేసిన లేదా ప్రజలకు చేసిన ప్రతీ వాగ్ధానమును నెరవేర్చండి. మరియు మీరు అల్లాహ్ పై ప్రమాణం చేసి దృఢపరచిన తరువాత మీ ప్రమాణాలను భంగపరచకండి. వాస్తవానికి మీరు చేసిన ప్రమాణాలను నెరవేర్చే విషయంలో మీరు అల్లాహ్ ను మీపై సాక్షిగా చేసుకున్నారు. నిశ్చయంగా మీరు చేస్తున్నది అల్లాహ్ కి తెలుసు. ఆయనపై అందులో నుండి ఏదీ గోప్యంగా లేదు. తొందరలోనే ఆయన వాటి పరంగా మీకు ప్రతిఫలాన్ని ప్రసాధిస్తాడు.

92

وَلَا تَكُونُوا۟ كَٱلَّتِى نَقَضَتْ غَزْلَهَا مِنۢ بَعْدِ قُوَّةٍ أَنكَٰثًۭا تَتَّخِذُونَ أَيْمَٰنَكُمْ دَخَلًۢا بَيْنَكُمْ أَن تَكُونَ أُمَّةٌ هِىَ أَرْبَىٰ مِنْ أُمَّةٍ ۚ إِنَّمَا يَبْلُوكُمُ ٱللَّهُ بِهِۦ ۚ وَلَيُبَيِّنَنَّ لَكُمْ يَوْمَ ٱلْقِيَٰمَةِ مَا كُنتُمْ فِيهِ تَخْتَلِفُونَ

And do not be like she who untwisted her spun thread after it was strong [by] taking your oaths as [means of] deceit between you because one community is more plentiful [in number or wealth] than another community. Allah only tries you thereby. And He will surely make clear to you on the Day of Resurrection that over which you used to differ.

మరియు మీరు ప్రమాణాలను భంగపరచి ఆ ముర్ఖ స్త్రీ వలే బుద్ధి లేని మూర్ఖులు వలే కాకండి. ఎవరైతే తన ఉన్నిని లేదా తన దూదిని వడకటంలో అలసిపోయి దాన్ని వడకటమును బిగువుగా చేసి ఆ తరువాత దాన్ని త్రెంచి దాన్ని వడకక ముందు ఎలా ఉందో అలా వదులుగా చేసివేసింది. అప్పుడు ఆమే దాన్ని వడకటంలో,త్రెంచి వేయటంలో అలిసిపోయింది. ఆమె ఆశించినది పొందలేదు. మీరు మీ ప్రమాణాలను మోసంగా చేసుకుని వాటి ద్వారా మీ లోనుండి ఒకరినొకరు మీ వర్గము మీ శతృవుల వర్గము కన్న ఎక్కువ అధికము,బలవంతులు అవటానికి మోసగించుకుంటున్నారు. అల్లాహ్ ప్రమాణాలను పరిపూర్ణం చేసే విషయంలో మీరు వాటిని పూర్తి చేస్తారా లేదా వాటిని భంగపరుస్తారా ? అని మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. మరియు అల్లాహ్ మీరు ఇహలోకంలో విభేధించుకున్న వాటిని ప్రళయదినాన మీకు తప్పకుండా స్పష్టపరుస్తాడు. అప్పుడు తప్పు చేసిన వాడి నుండి సరైన వాడిని,అసత్యపరుడి నుండి నిజాయితీపరుడిని స్పష్టపరుస్తాడు.

93

وَلَوْ شَآءَ ٱللَّهُ لَجَعَلَكُمْ أُمَّةًۭ وَٰحِدَةًۭ وَلَٰكِن يُضِلُّ مَن يَشَآءُ وَيَهْدِى مَن يَشَآءُ ۚ وَلَتُسْـَٔلُنَّ عَمَّا كُنتُمْ تَعْمَلُونَ

And if Allah had willed, He could have made you [of] one religion, but He causes to stray whom He wills and guides whom He wills. And you will surely be questioned about what you used to do.

మరియు ఒక వేళ అల్లాహ్ తలచుకుంటే మిమ్మల్ని సత్యంపై కలిసి ఉండేటట్లుగా ఒకే జాతిగా చేసేవాడు. కాని పరిశుద్ధుడైన ఆయన తాను తలచుకున్న వాడిని తన న్యాయముతో సత్యము నుండి,ప్రమాణాలను పూర్తి చేయటం నుండి పరాభవమునకు లోను చేసి అపమార్గమునకు గురి చేస్తాడు. మరియు తాను కోరుకున్న వాడిని తన అనుగ్రహము ద్వారా దాని సౌభాగ్యమును కలిగిస్తాడు. మీరు ఇహలోకములో ఏమి చేస్తుండేవారో వాటి గురించి ప్రళయదినాన తప్పకుండా ప్రశ్నించబడుతారు.

94

وَلَا تَتَّخِذُوٓا۟ أَيْمَٰنَكُمْ دَخَلًۢا بَيْنَكُمْ فَتَزِلَّ قَدَمٌۢ بَعْدَ ثُبُوتِهَا وَتَذُوقُوا۟ ٱلسُّوٓءَ بِمَا صَدَدتُّمْ عَن سَبِيلِ ٱللَّهِ ۖ وَلَكُمْ عَذَابٌ عَظِيمٌۭ

And do not take your oaths as [means of] deceit between you, lest a foot slip after it was [once] firm, and you would taste evil [in this world] for what [people] you diverted from the way of Allah, and you would have [in the Hereafter] a great punishment.

మరియు మీరు మీ ప్రమాణాలను మోసంగా చేసుకుని వాటి ద్వారా ఒకరినొకరు మోసగించుకోకండి.వాటిలో మీరు మీ కోరికలను అనుసరిస్తున్నారు. అయితే మీరు కోరుకున్నప్పుడు వాటిని భంగపరుస్తున్నారు. మీరు కోరుకున్నప్పుడు వాటిని పూర్తి చేస్తున్నారు. నిశ్చయంగా మీరు ఒక వేళ అలా చేస్తే మీ పాదాలు ఋజు మార్గంపై స్థిరపడిన తరువాత దాని నుండి జారిపోతాయి. మరియు మీరు అల్లాహ్ మార్గము నుండి తప్పిపోవటం వలన,ఇతరులను దాని నుండి తప్పించటం వలన శిక్షను చవిచూస్తారు. మరియు మీకు రెట్టింపు శిక్ష ఉంటుంది.

95

وَلَا تَشْتَرُوا۟ بِعَهْدِ ٱللَّهِ ثَمَنًۭا قَلِيلًا ۚ إِنَّمَا عِندَ ٱللَّهِ هُوَ خَيْرٌۭ لَّكُمْ إِن كُنتُمْ تَعْلَمُونَ

And do not exchange the covenant of Allah for a small price. Indeed, what is with Allah is best for you, if only you could know.

మరియు మీరు అల్లాహ్ వాగ్ధానమునకు బదులుగా మీ ప్రమాణములను భంగపరచి,వాటిని పూర్తి చేయటమును వదిలి కొద్దిపాటి లాభమును కోరుకోకండి.నిశ్చయంగా అల్లాహ్ వద్ద ఉన్న ది ఇహలోకములో సహాయం,యుద్ధప్రాప్తి,పరలోకంలో తన వద్ద ఉన్న శాస్వత అనుగ్రహాలు ప్రమాణాలు భంగపరచి కొద్దిపాటి లాభము వారు ఏదైతే పొందుతారో దానికన్న మీ కొరకు ఎంతో మేలైనది ఒక వేళ అది మీరు తెలుసుకోగలిగితే.

96

مَا عِندَكُمْ يَنفَدُ ۖ وَمَا عِندَ ٱللَّهِ بَاقٍۢ ۗ وَلَنَجْزِيَنَّ ٱلَّذِينَ صَبَرُوٓا۟ أَجْرَهُم بِأَحْسَنِ مَا كَانُوا۟ يَعْمَلُونَ

Whatever you have will end, but what Allah has is lasting. And We will surely give those who were patient their reward according to the best of what they used to do.

ఓ ప్రజలారా మీ వద్ద ఉన్న సంపద,సుఖభోగాలు,అనుగ్రహాలు అంతమైపోతాయి ఒక వేళ అవి అధికంగా ఉన్నా కూడా.అల్లాహ్ వద్ద ఉన్న ప్రతిఫలం (ఎల్లప్పుడూ) మిగిలి ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఎలా ఎల్లప్పుడు ఉండేదానిపై అంతం అయిపోయే దాన్ని ప్రాధాన్యతనిస్తున్నారు ?. మరియు తమ ప్రమాణాలపై స్థిరంగా ఉండి వాటిని భంగపరచకుండా ఉన్నవారికి మేము తప్పకుండా వారు చేసిన విధేయత కార్యాలకన్న మంచి ప్రతిఫలాన్ని ప్రసాధిస్తాము. అప్పుడు మేము వారికి పుణ్యమునకు ప్రతిఫలము పదిరెట్ల నుండి ఏడువందల రెట్ల వరకు ఇంకా ఎక్కువ రెట్లు ప్రసాధిస్తాము.

97

مَنْ عَمِلَ صَٰلِحًۭا مِّن ذَكَرٍ أَوْ أُنثَىٰ وَهُوَ مُؤْمِنٌۭ فَلَنُحْيِيَنَّهُۥ حَيَوٰةًۭ طَيِّبَةًۭ ۖ وَلَنَجْزِيَنَّهُمْ أَجْرَهُم بِأَحْسَنِ مَا كَانُوا۟ يَعْمَلُونَ

Whoever does righteousness, whether male or female, while he is a believer - We will surely cause him to live a good life, and We will surely give them their reward [in the Hereafter] according to the best of what they used to do.

పురుషుడు గాని స్త్రీ గాని ఎవరైనా అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి ధర్మానికి అనుగుణంగా ఏదైన సత్కార్యము చేస్తే మేము తప్పకుండా అతనికి ఇహలోకములో అల్లాహ్ తీర్పుపై సంతృప్తి,ఉన్నదానిపై సంతోషము,విధేయత కార్యాలను చేసే సౌభాగ్యము ద్వారా మంచి జివితాన్ని తప్పకుండా ప్రసాధిస్తాము. మరియు ఇహలోకములో వారు చేసిన సత్కార్యములకన్న మంచిగా పరలోకములో వారి ప్రతిఫలాన్ని మేము తప్పకుండా ప్రసాధిస్తాము.

98

فَإِذَا قَرَأْتَ ٱلْقُرْءَانَ فَٱسْتَعِذْ بِٱللَّهِ مِنَ ٱلشَّيْطَٰنِ ٱلرَّجِيمِ

So when you recite the Qur'an, [first] seek refuge in Allah from Satan, the expelled [from His mercy].

ఓ విశ్వాసపరుడా నీవు ఖుర్ఆన్ పఠించదలచుకున్నప్పుడు అల్లాహ్ కారుణ్యము నుండి ధూత్కరించబడిన షైతాను దురాలోచనల నుండి నిన్ను రక్షించమని అల్లాహ్ ని వేడుకో.

99

إِنَّهُۥ لَيْسَ لَهُۥ سُلْطَٰنٌ عَلَى ٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَلَىٰ رَبِّهِمْ يَتَوَكَّلُونَ

Indeed, there is for him no authority over those who have believed and rely upon their Lord.

నిశ్చయంగా షైతానుకు అల్లాహ్ ను విశ్వసించిన వారిపై ఎటువంటి అధికారము లేదు. మరియు వారు తమ వ్యవహారాలన్నింటిలో ఒక్కడైన తమ ప్రభువుపై నమ్మకమును కలిగి ఉంటారు.

100

إِنَّمَا سُلْطَٰنُهُۥ عَلَى ٱلَّذِينَ يَتَوَلَّوْنَهُۥ وَٱلَّذِينَ هُم بِهِۦ مُشْرِكُونَ

His authority is only over those who take him as an ally and those who through him associate others with Allah.

దుష్ప్రేరణ ద్వారా అతని అధికారము మాత్రం అతన్ని స్నేహితునిగా చేసుకుని అతని భ్రష్టు పట్టించటంలో అతనికి విధేయత చూపినవారిపై ఉంటుంది. మరియు వారే అతని భ్రష్టు పట్టించటం వలన అల్లాహ్ తోపాటు సాటి కల్పించి,ఆయన తోపాటు వేరేవారిని ఆరాధించేవారు.

An-Nahl 16:100Listen in Qur'an →

Commentary: Al-Mukhtasar in Interpreting the Noble Qur'an by Tafsir Center for Quranic Studies. Qur'an text and translation via AlQuran Cloud.