Muslim99Muslim99
← Tafsir library

16. An-Nahl

The Bee · Meccan · 128 ayahs

سُورَةُ النَّحۡلِ

Reading Al-Mukhtasar in Interpreting the Noble Qur'an by Tafsir Center for Quranic Studies

Ayahs 81–90 of 128

81

وَٱللَّهُ جَعَلَ لَكُم مِّمَّا خَلَقَ ظِلَٰلًۭا وَجَعَلَ لَكُم مِّنَ ٱلْجِبَالِ أَكْنَٰنًۭا وَجَعَلَ لَكُمْ سَرَٰبِيلَ تَقِيكُمُ ٱلْحَرَّ وَسَرَٰبِيلَ تَقِيكُم بَأْسَكُمْ ۚ كَذَٰلِكَ يُتِمُّ نِعْمَتَهُۥ عَلَيْكُمْ لَعَلَّكُمْ تُسْلِمُونَ

And Allah has made for you, from that which He has created, shadows and has made for you from the mountains, shelters and has made for you garments which protect you from the heat and garments which protect you from your [enemy in] battle. Thus does He complete His favor upon you that you might submit [to Him].

మరియు అల్లాహ్ చెట్లను,భవనాలను మీ కొరకు తయారు చేశాడు. మీరు వాటి ద్వారా ఎండ నుంచి నీడను పొందుతున్నారు. మరియు ఆయన పర్వతాల్లో సొరంగాలను,లోయలను,గుహలను తయారు చేశాడు. వాటిలో మీరు చలి నుండి,ఎండ నుండి,శతృవుల నుండి రక్షణ పొందుతున్నారు. మరియు ఆయన మీ కొరకు పత్తి నుండి చొక్కాలను (అంగిలను),వస్త్రాలను తయారు చేశాడు. అవి మీ నుండి ఎండను,చలిని నిర్మూలిస్తాయి. మరియు ఆయన మీ కొరకు యుద్ధంలో మిమ్మల్ని ఒకరినొకరు రక్షించుకునే కవచాలను తయారు చేశాడు. ఆయుధాలు మీ శరీరములను ఛేదించలేవు. అల్లాహ్ మీపై మునుపటి అనుగ్రహములను అనుగ్రహించినట్లే మీపై ఆయన తన అనుగ్రహాలను మీరు ఆయన ఒక్కడినే విధేయత చూపుతారని,ఆయనతోపాటు ఎవరిని సాటి కల్పించరని ఆశిస్తూ పరిపూర్ణం చేస్తాడు.

82

فَإِن تَوَلَّوْا۟ فَإِنَّمَا عَلَيْكَ ٱلْبَلَٰغُ ٱلْمُبِينُ

But if they turn away, [O Muhammad] - then only upon you is [responsibility for] clear notification.

ఓ ప్రవక్తా ఒక వేళ వారు విశ్వాసము నుండి,మీరు తీసుకుని వచ్చిన దానిని అంగీకరించటం నుండి విముఖత చూపితే మీ పై కేవలం మీకు చేరవేయమని ఆదేశించబడిన వాటిని స్పష్టంగా చేరవేయటం మాత్రమే బాధ్యత. సన్మార్గముపై వారిని ప్రేరేపించటం మీ బాధ్యత కాదు.

83

يَعْرِفُونَ نِعْمَتَ ٱللَّهِ ثُمَّ يُنكِرُونَهَا وَأَكْثَرُهُمُ ٱلْكَٰفِرُونَ

They recognize the favor of Allah; then they deny it. And most of them are disbelievers.

ముష్రికులకు అల్లాహ్ వారిపై అనుగ్రహించిన అనుగ్రహాల గురించి తెలుసు. వాటిలో నుంచి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను వారి వద్దకు ప్రవక్తగా పంపించటం. ఆ తరువాత వారు అల్లాహ్ అనుగ్రహాల పట్ల కృతజ్ఞతావైఖరి లేకపోవటం ద్వారా,ఆయన ప్రవక్తను తిరస్కరించటం ద్వారా ఆయన అనుగ్రహాలను తిరస్కరించారు. వారిలో నుండి చాలా మంది పరిశుద్ధుడైన ఆయన అనుగ్రహాలను తిరస్కరించేవారు ఉన్నారు.

84

وَيَوْمَ نَبْعَثُ مِن كُلِّ أُمَّةٍۢ شَهِيدًۭا ثُمَّ لَا يُؤْذَنُ لِلَّذِينَ كَفَرُوا۟ وَلَا هُمْ يُسْتَعْتَبُونَ

And [mention] the Day when We will resurrect from every nation a witness. Then it will not be permitted to the disbelievers [to apologize or make excuses], nor will they be asked to appease [Allah].

ఓ ప్రవక్తా జ్ఞాపకం చేసుకోండి ఆ రోజు అల్లాహ్ ప్రతి జాతి నుండి దాని ప్రవక్తను ఎవరినైతే ప్రవక్తగా వారి వద్దకు ఆయన పంపాడో లేపుతాడు.అతడు వారిలో నుంచి విశ్వసించిన వారి విశ్వాసము పై,అవిశ్వాసపరుని అవిశ్వాసముపై సాక్ష్యమిస్తాడు. ఆ తరువాత అవిశ్వాసపరులకు వారు చేసుకున్న అవిశ్వాసము నుండి క్షమాపణ కోరుకోవటానికి అనుమతించబడదు. మరియు తమ ప్రభువు సంతుష్టపరిచే ఆచరణలు చేయటానికి వారిని ఇహలోకం వైపునకు మరలించబడదు. పరలోకము లెక్కతీసుకునే గృహము,ఆచరణల గృహము కాదు.

85

وَإِذَا رَءَا ٱلَّذِينَ ظَلَمُوا۟ ٱلْعَذَابَ فَلَا يُخَفَّفُ عَنْهُمْ وَلَا هُمْ يُنظَرُونَ

And when those who wronged see the punishment, it will not be lightened for them, nor will they be reprieved.

మరియు దుర్మార్గులైన ముష్రికులు శిక్షను కళ్లతో చూసినప్పుడు వారి నుండి శిక్షను తేలిక చేయటం జరగదు. మరియు దాన్ని వారి నుండి వెనుకకు నెట్టి వారికి గడువు ఇవ్వటం జరగదు. కాని వారు అందులో శాస్వతంగా ఉండటానికి ప్రవేశిస్తారు.

86

وَإِذَا رَءَا ٱلَّذِينَ أَشْرَكُوا۟ شُرَكَآءَهُمْ قَالُوا۟ رَبَّنَا هَٰٓؤُلَآءِ شُرَكَآؤُنَا ٱلَّذِينَ كُنَّا نَدْعُوا۟ مِن دُونِكَ ۖ فَأَلْقَوْا۟ إِلَيْهِمُ ٱلْقَوْلَ إِنَّكُمْ لَكَٰذِبُونَ

And when those who associated others with Allah see their "partners," they will say," Our Lord, these are our partners [to You] whom we used to invoke besides You." But they will throw at them the statement, "Indeed, you are liars."

ముష్రికులు తాము అల్లాహ్ ను వదిలి ఆరాధించే తమ ఆరాధ్యదైవాలను పరలోకములో చూసినప్పుడు వారు ఇలా పలుకుతారు : ఓ మా ప్రభువా వీరందరినే మేము నిన్ను వదిలి ఆరాధించి సాటి కల్పించినవారు. వారు తమ భారమును వారిపై వేయటానికి అలా పలుకుతారు. అప్పుడు అల్లాహ్ వారి ఆరాధ్యదైవాలకు మాట్లాడిస్తాడు. అప్పుడు వారు వారిని ఖండిస్తూ ఇలా పలుకుతారు : ఓ ముష్రికులారా మీరు నిశ్చయంగా అల్లాహ్ తోపాటు సాటికల్పించి మీ ఆరాధన విషయంలో అబధ్ధం పలుకుతున్నారు. ఆయనతో పాటు సాటి ఉంటేగా ఆరాధించబడటానికి.

87

وَأَلْقَوْا۟ إِلَى ٱللَّهِ يَوْمَئِذٍ ٱلسَّلَمَ ۖ وَضَلَّ عَنْهُم مَّا كَانُوا۟ يَفْتَرُونَ

And they will impart to Allah that Day [their] submission, and lost from them is what they used to invent.

ముష్రికులు ఒక్కడైన అల్లాహ్ కి తమను సమర్పించుకుని విధేయులైపోతారు. అల్లాహ్ వద్ద తమ విగ్రహాలు తమ కొరకు సిఫారసు చేస్తాయని వాదిస్తూ వారు కల్పించుకున్నవి వారి నుండి తొలగిపోతాయి.

88

ٱلَّذِينَ كَفَرُوا۟ وَصَدُّوا۟ عَن سَبِيلِ ٱللَّهِ زِدْنَٰهُمْ عَذَابًۭا فَوْقَ ٱلْعَذَابِ بِمَا كَانُوا۟ يُفْسِدُونَ

Those who disbelieved and averted [others] from the way of Allah - We will increase them in punishment over [their] punishment for what corruption they were causing.

ఎవరైతే అల్లాహ్ తోపాటు సాటి కల్పించి,ఇతరులను అల్లాహ్ మార్గము నుండి మరల్చి వేస్తారో వారిని వారి చెడు వలన,ఇతరులను అపమార్గమునకు లోను చేసి చెడును ప్రభలించటం వలన వారి అవిశ్వాసము వలన అర్హులైన వారికి మేము శిక్షపై శిక్షను అధికం చేస్తాము.

89

وَيَوْمَ نَبْعَثُ فِى كُلِّ أُمَّةٍۢ شَهِيدًا عَلَيْهِم مِّنْ أَنفُسِهِمْ ۖ وَجِئْنَا بِكَ شَهِيدًا عَلَىٰ هَٰٓؤُلَآءِ ۚ وَنَزَّلْنَا عَلَيْكَ ٱلْكِتَٰبَ تِبْيَٰنًۭا لِّكُلِّ شَىْءٍۢ وَهُدًۭى وَرَحْمَةًۭ وَبُشْرَىٰ لِلْمُسْلِمِينَ

And [mention] the Day when We will resurrect among every nation a witness over them from themselves. And We will bring you, [O Muhammad], as a witness over your nation. And We have sent down to you the Book as clarification for all things and as guidance and mercy and good tidings for the Muslims.

ఓ ప్రవక్తా ఒక సారి గుర్తు చేసుకోండి ఆ రోజుని ఏ రోజునైతే మేము ప్రతీ జాతిలో, వారిపై వారు దేనిపైనైతే ఉండేవారో అవిశ్వాసము లేదా విశ్వాసము గురించి సాక్ష్యం పలికే ఒక ప్రవక్తను లేపి నిలబెడుతాము. ఆ ప్రవక్త వారి కోవకు చెందిన వాడై,వారి భాషను మాట్లాడే వాడై ఉంటాడు. ఓ ప్రవక్తా మేము మిమ్మల్ని జాతుల వారందరిపై సాక్ష్యం పలికే వాడిగా తీసుకుని వస్తాము. మరియు వారికి హలాల్,హరాం, ప్రతిఫలం,శిక్ష వేరేవి స్పష్టత అవసరమైన వాటన్నింటి స్పష్టత ఇవ్వటానికి మేము మీపై ఖుర్ఆన్ ను అవతరింపజేశాము. మరియు మేము దాన్ని ప్రజలకి సత్యం వైపునకు మార్గదర్శకముగా,దానిపై విశ్వాసమును కనబరచి అందులో ఉన్న వాటిని ఆచరించిన వారికి కారుణ్యంగా,శాస్వత అనుగ్రహాల కోసం నిరీక్షించటం ద్వారా అల్లాహ్ పై విశ్వాసమును కనబరచిన వారికి శుభవార్తనిచ్చేదానిగా అవతరింపజేశాము.

90

۞ إِنَّ ٱللَّهَ يَأْمُرُ بِٱلْعَدْلِ وَٱلْإِحْسَٰنِ وَإِيتَآئِ ذِى ٱلْقُرْبَىٰ وَيَنْهَىٰ عَنِ ٱلْفَحْشَآءِ وَٱلْمُنكَرِ وَٱلْبَغْىِ ۚ يَعِظُكُمْ لَعَلَّكُمْ تَذَكَّرُونَ

Indeed, Allah orders justice and good conduct and giving to relatives and forbids immorality and bad conduct and oppression. He admonishes you that perhaps you will be reminded.

నిశ్చయంగా అల్లాహ్ తన దాసులకు న్యాయం చేయమని,దాసుడు అల్లాహ్ హక్కులను,దాసుల హక్కులను నెరవేర్చమని,ఆదేశం విషయంలో ప్రాధాన్యతనివ్వటం అవసరం ఉన్న చోట సత్యముతో మాత్రమే ఒకరిని ఒకరిపై ప్రాధాన్యతనివ్వమని ఆదేశిస్తున్నాడు. మరియు దాసుడు తనపై తప్పనిసరికాని(దాన్ని) స్వచ్ఛందంగా ఖర్చు చేయటం,దుర్మార్గుడుని క్షమించటం లాంటి కార్యాలను ప్రాధాన్యతనివ్వటంలో మంచిగా చేయమని ఆదేశిస్తున్నాడు. మరియు బంధువులకు అవసరమైన వాటిని ఇవ్వమని ఆదేశిస్తున్నాడు. మరియు అశ్లీల మాటల్లాంటి దుర్భాషలాడటం నుండి,వ్యభిచారము లాంటి దుష్కార్యమునకు పాల్పడటం నుండి వారిస్తున్నాడు.మరియు ధర్మం ఇష్టపడని ప్రతీ పాపకార్యము నుండి వారిస్తున్నాడు. మరియు ప్రజలపై దుర్మార్గమునకు పాల్పడటం,అహంకారమును చూపటం నుండి వారిస్తున్నాడు.ఈ ఆయతులో మీకు ఆదేశించిన వాటి ద్వారా, మీకు వారించిన వాటి ద్వారా ,హితోపదేశం చేసిన వాటి ద్వారా మీరు గుణపాఠం నేర్చుకుంటారని ఆశిస్తూ అల్లాహ్ మీకు హితోపదేశం చేస్తున్నాడు.

Commentary: Al-Mukhtasar in Interpreting the Noble Qur'an by Tafsir Center for Quranic Studies. Qur'an text and translation via AlQuran Cloud.