Muslim99Muslim99
← Tafsir library

16. An-Nahl

The Bee · Meccan · 128 ayahs

سُورَةُ النَّحۡلِ

Reading Al-Mukhtasar in Interpreting the Noble Qur'an by Tafsir Center for Quranic Studies

Ayahs 51–60 of 128

51

۞ وَقَالَ ٱللَّهُ لَا تَتَّخِذُوٓا۟ إِلَٰهَيْنِ ٱثْنَيْنِ ۖ إِنَّمَا هُوَ إِلَٰهٌۭ وَٰحِدٌۭ ۖ فَإِيَّٰىَ فَٱرْهَبُونِ

And Allah has said, "Do not take for yourselves two deities. He is but one God, so fear only Me."

పరిశుద్ధుడైన అల్లాహ్ తన దాసులందరితో ఇలా పలికాడు : మీరు ఇద్దరు ఆరాధ్యదైవాలుగా చేసుకోకండి. సత్య ఆరాధ్య దైవము ఒక్కడే అతనికి రెండవవాడు లేడు, ఎవరు సాటి లేరు.మీరు నాతోనే భయపడండి. నాతోకాక ఇతరులతో భయపడకండి.

52

وَلَهُۥ مَا فِى ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضِ وَلَهُ ٱلدِّينُ وَاصِبًا ۚ أَفَغَيْرَ ٱللَّهِ تَتَّقُونَ

And to Him belongs whatever is in the heavens and the earth, and to Him is [due] worship constantly. Then is it other than Allah that you fear?

భూమ్యాకాశముల్లో ఉన్న సమస్తమును సృష్టించటంలో,పాలించటంలో,పర్యాలోచన చేయటంలో ఆయన ఒక్కడికే అధికారం కలదు. విధేయత,అణకువ,చిత్తశుద్ధి ఆయన ఒక్కడి కొరకే స్థిరము. అయితే మీరు అల్లాహ్ ను వదిలి ఇతరులతో భయపడుతారా ?!.అలా జరగకూడదు,మీరు కేవలం ఆయన ఒక్కడితోనే భయపడాలి.

53

وَمَا بِكُم مِّن نِّعْمَةٍۢ فَمِنَ ٱللَّهِ ۖ ثُمَّ إِذَا مَسَّكُمُ ٱلضُّرُّ فَإِلَيْهِ تَجْـَٔرُونَ

And whatever you have of favor - it is from Allah. Then when adversity touches you, to Him you cry for help.

ఓ ప్రజలారా మీకు కలిగిన ధార్మిక లేదా ప్రాపంచిక అనుగ్రహాలు పరిశుద్ధుడైన అల్లాహ్ వద్ద నుండి వచ్చినవి,ఇతరుల వద్ద నుంచి కావు. అంతే కాదు మీకు కలిగే ఆపదలు లేదా రోగము లేదా పేదరికం సమయంలో మీకు కలిగినది మీ నుండి తొలగిపోవటానికి మీరు ఆయన ఒక్కడి వైపే కడు వినయంగా వేడుకుంటారు. అనుగ్రహాలను ప్రసాధంచేవాడు, కష్టమును తొలగించేవాడు(ఆయనే). ఆయన ఒక్కడి ఆరాధన చేయబడటం తప్పనిసరి.

54

ثُمَّ إِذَا كَشَفَ ٱلضُّرَّ عَنكُمْ إِذَا فَرِيقٌۭ مِّنكُم بِرَبِّهِمْ يُشْرِكُونَ

Then when He removes the adversity from you, at once a party of you associates others with their Lord

ఆ తరువాత ఆయన మీ అర్ధనను స్వీకరించి మీకు కలిగిన కష్టమును తొలగించగానే మీలో నుండి ఒక వర్గము తమ ప్రభవుతో సాటి కల్పించ సాగారు.ఎలాగంటే ఆయనతోపాటు ఇతరులను ఆరాధించసాగారు. అయితే ఇది ఏమి దిగజారుడుతనం ?!.

55

لِيَكْفُرُوا۟ بِمَآ ءَاتَيْنَٰهُمْ ۚ فَتَمَتَّعُوا۟ ۖ فَسَوْفَ تَعْلَمُونَ

So they will deny what We have given them. Then enjoy yourselves, for you are going to know.

అల్లాహ్ తోపాటు వారు సాటి కల్పించటం వారిపై ఉన్న అల్లాహ్ అనుగ్రహాలు వాటిలోంచి నష్టమును తొలగించటం వంటి అనుగ్రహాల పట్ల వారిని కృతఘ్నులయ్యేటట్లు చేశింది. అందువలనే వారితో ఇలా పలకబడింది : మీరు ఉన్న సుఖాలను మీ వద్దకు తొందరగా,ఆలస్యంగా వచ్చే అల్లాహ్ శిక్ష వచ్చేంతవరకు అనుభవించండి.

56

وَيَجْعَلُونَ لِمَا لَا يَعْلَمُونَ نَصِيبًۭا مِّمَّا رَزَقْنَٰهُمْ ۗ تَٱللَّهِ لَتُسْـَٔلُنَّ عَمَّا كُنتُمْ تَفْتَرُونَ

And they assign to what they do not know a portion of that which We have provided them. By Allah, you will surely be questioned about what you used to invent.

ముష్రికులు మేము వారికి ప్రసాధించిన జీవనోపాధిలో నుండి నిర్జీవం (జమాదాత్ చలనం లేని,స్థిరమైన,జీవం లేని) కావటం చేత ఎటువంటి జ్ఞానము లేని,లాభం చేకూర్చలేని,నష్టం కలిగించలేని తమ విగ్రహాల కొరకు కొంత భాగమును కేటాయిస్తున్నారు. మరియు దాని ద్వారా వాటి సాన్నిద్యాన్ని పొందదలుస్తున్నారు. ఓ ముష్రికులారా అల్లాహ్ సాక్షిగా మీరు ఈ విగ్రహాల గురించి అవి ఆరాధ్య దైవాలని,మీ సంపదల్లోంచి వారి కొరకు భాగం ఉన్నదని మీరు వాదిస్తున్న వాటి గురించి ప్రళయదినాన తప్పకుండా మీరు ప్రశ్నించబడుతారు.

57

وَيَجْعَلُونَ لِلَّهِ ٱلْبَنَٰتِ سُبْحَٰنَهُۥ ۙ وَلَهُم مَّا يَشْتَهُونَ

And they attribute to Allah daughters - exalted is He - and for them is what they desire.

ముష్రికులు అల్లాహ్ కి కుమార్తెలను అంటగడుతున్నారు. మరియు వారిని దైవదూతలుగా విశ్వసిస్తున్నారు. వారు ఆయనకు సంతానమును అంటగడుతున్నారు. తమకు ఇష్టంలేని వాటిని ఆయన కొరకు ఎంచుకుంటున్నారు. వారిలో నుండి ఆయన కొరకు వారు అంటగడుతున్న వాటి నుండి ఆయన పరిశుద్ధుడు,పవితృడు.మరియు వారు తమ మనస్సులు కోరే మగ సంతానమును తమ కొరకు ఎంచుకొంటున్నారు. అయితే దీనికన్న మహా పాపం ఏమి ఉంటుంది?! .

58

وَإِذَا بُشِّرَ أَحَدُهُم بِٱلْأُنثَىٰ ظَلَّ وَجْهُهُۥ مُسْوَدًّۭا وَهُوَ كَظِيمٌۭ

And when one of them is informed of [the birth of] a female, his face becomes dark, and he suppresses grief.

ఈ ముష్రికులందరిలో నుండి ఎవరికైనా ఆడపిల్ల జన్మించినదని సమాచారమిచ్చినప్పుడు తమకు ఇవ్వబడిన సమాచారము నచ్చక అతని ముఖము నల్లగా మారిపోతుంది. అతని మనసు దుఃఖముతో,బాధతో నిండిపోతుంది. ఆ తరువాత అతను తన మనస్సుకు ఇష్టంలేని వాటిని అల్లాహ్ కి అంటగడుతాడు.

59

يَتَوَٰرَىٰ مِنَ ٱلْقَوْمِ مِن سُوٓءِ مَا بُشِّرَ بِهِۦٓ ۚ أَيُمْسِكُهُۥ عَلَىٰ هُونٍ أَمْ يَدُسُّهُۥ فِى ٱلتُّرَابِ ۗ أَلَا سَآءَ مَا يَحْكُمُونَ

He hides himself from the people because of the ill of which he has been informed. Should he keep it in humiliation or bury it in the ground? Unquestionably, evil is what they decide.

ఆడ సంతానము జన్మించినదని అతనికి ఇవ్వబడిన వార్తను దుర్వార్తగా భావించి తన జాతి వారి నుండి అతడు నక్కి నక్కి దాక్కొని తిరుగుతుంటాడు. అతని అంతరంగము అతనితో ఇలా అంటుంది : అవమానముతో,పరాభవముతో కూడిన ఈ ఆడ బిడ్డను అట్టిపెట్టుకోవాలా లేదా ఆమెను మట్టిలో పూడ్చి జీవ సమాధి చేయాలా ?.ముష్రికులు తీసుకునే నిర్ణయం ఎప్పుడైతే వారి మనసులకి నచ్చదో వాటిని తమ ప్రభువు కొరకు నిర్ణయిస్తారు. అది ఎంతో చెడ్డదైనది.

60

لِلَّذِينَ لَا يُؤْمِنُونَ بِٱلْءَاخِرَةِ مَثَلُ ٱلسَّوْءِ ۖ وَلِلَّهِ ٱلْمَثَلُ ٱلْأَعْلَىٰ ۚ وَهُوَ ٱلْعَزِيزُ ٱلْحَكِيمُ

For those who do not believe in the Hereafter is the description of evil; and for Allah is the highest attribute. And He is Exalted in Might, the Wise.

పరలోకముపై విశ్వాసము లేని అవిశ్వాసపరులకి సంతాన అవసరం ఉండటం,అజ్ఞానం,అవిశ్వాసం లాంటి దుర్గుణాలు కలవు. మరియు ఘనత,పరిపూర్ణత,అక్కరలేకపోవటం,జ్ఞానం లాంటి ఉన్నతమైన గర్వించదగ గుణాలు అల్లాహ్ కే గలవు. మరియు పరిశుద్ధుడైన ఆయన తన రాజ్యాధికారములో ఎవరూ ఆధిక్యత చూపలేని ఆధిక్యుడు,తన సృష్టించటంలో,పర్యాలోచనలో,తన శాసనాల్లో వివేకవంతుడు.

Commentary: Al-Mukhtasar in Interpreting the Noble Qur'an by Tafsir Center for Quranic Studies. Qur'an text and translation via AlQuran Cloud.