Muslim99Muslim99
← Tafsir library

16. An-Nahl

The Bee · Meccan · 128 ayahs

سُورَةُ النَّحۡلِ

Reading Al-Mukhtasar in Interpreting the Noble Qur'an by Tafsir Center for Quranic Studies

Ayahs 31–40 of 128

31

جَنَّٰتُ عَدْنٍۢ يَدْخُلُونَهَا تَجْرِى مِن تَحْتِهَا ٱلْأَنْهَٰرُ ۖ لَهُمْ فِيهَا مَا يَشَآءُونَ ۚ كَذَٰلِكَ يَجْزِى ٱللَّهُ ٱلْمُتَّقِينَ

Gardens of perpetual residence, which they will enter, beneath which rivers flow. They will have therein whatever they wish. Thus does Allah reward the righteous -

శాస్వతమైన,స్థిరమైన స్వర్గవనాల్లో వారు ప్రవేశిస్తారు. వాటి భవనములు,వాటి వృక్షాల క్రింది నుండి కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. వారి కొరకు ఈ స్వర్గవనాల్లో వారి మనస్సులు ఇష్టపడే తినే,త్రాగే ఆహారపదార్ధాలు,ఇంకా వేరేవి ఉంటాయి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జాతి వారిలో నుండి దైవభీతి కలవారికి ఆయన ప్రసాధించే ఈ ప్రతిఫలం లాంటిదే పూర్వ జాతుల వారిలో నుండి దైవభీతి కలవారికి ఆయన ప్రతిఫలమును ప్రసాధిస్తాడు.

32

ٱلَّذِينَ تَتَوَفَّىٰهُمُ ٱلْمَلَٰٓئِكَةُ طَيِّبِينَ ۙ يَقُولُونَ سَلَٰمٌ عَلَيْكُمُ ٱدْخُلُوا۟ ٱلْجَنَّةَ بِمَا كُنتُمْ تَعْمَلُونَ

The ones whom the angels take in death, [being] good and pure; [the angels] will say, "Peace be upon you. Enter Paradise for what you used to do."

దైవదూతల్లోంచి మరణ దూత,అతని సహాయకులు ఎవరి ఆత్మలనైతే వారి హృదయములు అవిశ్వాసము నుండి పరిశుద్ధముగా ఉన్నస్థతిలో తీస్తారో , దైవ దూతలు వారిని ఉద్దేశించి తమ మాటల్లో ఇలా పలుకుతారు : మీపై శాంతి కలుగుగాక. మీరు ప్రతీ ఆపద నుండి సురక్షితంగా ఉన్నారు. మీరు ఇహలోకములో ఆచరించే సరైన విశ్వాసము,సత్కర్మకు బదులుగా స్వర్గంలో ప్రవేశించండి.

33

هَلْ يَنظُرُونَ إِلَّآ أَن تَأْتِيَهُمُ ٱلْمَلَٰٓئِكَةُ أَوْ يَأْتِىَ أَمْرُ رَبِّكَ ۚ كَذَٰلِكَ فَعَلَ ٱلَّذِينَ مِن قَبْلِهِمْ ۚ وَمَا ظَلَمَهُمُ ٱللَّهُ وَلَٰكِن كَانُوٓا۟ أَنفُسَهُمْ يَظْلِمُونَ

Do the disbelievers await [anything] except that the angels should come to them or there comes the command of your Lord? Thus did those do before them. And Allah wronged them not, but they had been wronging themselves.

ఏమీ ? ఈ తిరస్కారులైన ముష్రికులందరు దైవదూతల్లోంచి మరణ దూత,అతని సహాయకులు వారి ప్రాణములను సేకరించటానికి,వారి ముఖములపై,వారి వీపులపై కొట్టడానికి వారి వద్దకు వచ్చేంత వరకు లేదా ఇహలోకములోనే శిక్ష ద్వారా వారిని నిర్మూలించటానికి అల్లాహ్ ఆదేశం వచ్చేంత వరకు నిరీక్షిస్తున్నారా ?. మక్కాలోని ముష్రికులు పాల్పడిన ఈ కార్యం లాంటి కార్యమును వారికన్న మనుపు ముష్రికులు పాల్పడ్డారు అప్పుడు అల్లాహ్ వారిని తుదిముట్టించాడు. ఆయన వారిని వినాశనమునకు గరి చేసినప్పుడు వారిపై హింసకు పాల్పడలేదు. కానీ వారే అల్లాహ్ పట్ల అవిశ్వాసం ద్వారా కావాలనే వినాశనమునకు కొనితెచ్చుకుని తమపై హింసకు పాల్పడ్డారు.

34

فَأَصَابَهُمْ سَيِّـَٔاتُ مَا عَمِلُوا۟ وَحَاقَ بِهِم مَّا كَانُوا۟ بِهِۦ يَسْتَهْزِءُونَ

So they were struck by the evil consequences of what they did and were enveloped by what they used to ridicule.

అప్పుడు వారు చేసుకున్న కర్మల శిక్షలు వారిపై వచ్చి పడ్డాయి. ఏ శిక్ష గురించి వారి ముందు ప్రస్తావించబడినప్పుడు వారు పరిహాసమాడేవారో ఆ శిక్ష వారిని చుట్టుముట్టింది.

35

وَقَالَ ٱلَّذِينَ أَشْرَكُوا۟ لَوْ شَآءَ ٱللَّهُ مَا عَبَدْنَا مِن دُونِهِۦ مِن شَىْءٍۢ نَّحْنُ وَلَآ ءَابَآؤُنَا وَلَا حَرَّمْنَا مِن دُونِهِۦ مِن شَىْءٍۢ ۚ كَذَٰلِكَ فَعَلَ ٱلَّذِينَ مِن قَبْلِهِمْ ۚ فَهَلْ عَلَى ٱلرُّسُلِ إِلَّا ٱلْبَلَٰغُ ٱلْمُبِينُ

And those who associate others with Allah say, "If Allah had willed, we would not have worshipped anything other than Him, neither we nor our fathers, nor would we have forbidden anything through other than Him." Thus did those do before them. So is there upon the messengers except [the duty of] clear notification?

తమ ఆరాధన విషయంలో అల్లాహ్ తోపాటు ఇతరులను సాటి కల్పించేవారు ఇలా పలికారు : ఒక వేళ అల్లాహ్ మేము ఆయన ఒక్కడినే ఆరాధించాలని,మేము ఆయన తోపాటు సాటి కల్పించకూడదని తలచుకుంటే మేము ఆయనను వదిలి ఇతరులను ఆరాధించేవారము కాదు. మేమూ కాదు,మా కన్న మునుపటి మా తాత ముత్తాతలూ కాదు. ఒక వేళ మేము దేనినీ నిషేధించకూడదని ఆయన తలచుకుంటే మేము నిషేధించేవారము కాదు. మునుపటి అవిశ్వాసపరులు ఇటువంటి అసత్య ఆధారాలతో పలికేవారు. దైవ ప్రవక్తలు ఏ సందేశాలను చేరవేయమని ఆదేశించబడ్డారో ఆసందేశాలను స్పష్టంగా చేరవేయటం మాత్రమే వారిపై బాధ్యత ఉన్నది. నిశ్చయంగా వారు సందేశాలను చేరవేశారు. అల్లాహ్ అవిశ్వాసపరుల కొరకు ఇచ్ఛను,ఎంపిక చేసే అధికారము ఇచ్చి వారి వద్దకు తన ప్రవక్తలను పంపించిన తరువాత తఖ్దీర్ ని నిరాకరించే విషయంలో అవిశ్వాసపరుల కొరకు ఎటువంటి ఆధారము లేదు.

36

وَلَقَدْ بَعَثْنَا فِى كُلِّ أُمَّةٍۢ رَّسُولًا أَنِ ٱعْبُدُوا۟ ٱللَّهَ وَٱجْتَنِبُوا۟ ٱلطَّٰغُوتَ ۖ فَمِنْهُم مَّنْ هَدَى ٱللَّهُ وَمِنْهُم مَّنْ حَقَّتْ عَلَيْهِ ٱلضَّلَٰلَةُ ۚ فَسِيرُوا۟ فِى ٱلْأَرْضِ فَٱنظُرُوا۟ كَيْفَ كَانَ عَٰقِبَةُ ٱلْمُكَذِّبِينَ

And We certainly sent into every nation a messenger, [saying], "Worship Allah and avoid Taghut." And among them were those whom Allah guided, and among them were those upon whom error was [deservedly] decreed. So proceed through the earth and observe how was the end of the deniers.

మరియు నిశ్చయంగా మేము పూర్వపు ప్రతి జాతిలో ఒక ప్రవక్తను పంపించాము. అతను తన జాతి వారిని అల్లాహ్ ఒక్కడినే ఆరాధించమని,ఆయన కాక వేరే ఏవైన విగ్రహాల,షైతానుల,ఇతర వాటి ఆరాధన వదిలివేయమని ఆదేశించాడు. వారిలో నుండి అల్లాహ్ ఎవరికి అనుగ్రహించాడో వాడు అతన్ని విశ్వసించి,అతని ప్రవక్త తీసుకుని వచ్చిన దాన్ని అనుసరించే వాడు ఉన్నాడు.మరియు వారిలో నుండి అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరచి,అతని ప్రవక్తపై అవిధేయత చూపినవాడు ఉన్నాడు. ఆయన అతనికి అనుగ్రహించలేదు. అప్పుడు అతనిపై మార్గభ్రష్టత అనివార్యమైపోయినది. అయితే మీరు తిరస్కారులపై శిక్ష,వినాశనము వచ్చిన తరువాత వారి పరిణామం ఏమయిందో చూడటానికి భూమిలో సంచరించండి.

37

إِن تَحْرِصْ عَلَىٰ هُدَىٰهُمْ فَإِنَّ ٱللَّهَ لَا يَهْدِى مَن يُضِلُّ ۖ وَمَا لَهُم مِّن نَّٰصِرِينَ

[Even] if you should strive for their guidance, [O Muhammad], indeed, Allah does not guide those He sends astray, and they will have no helpers.

ఓ ప్రవక్తా ఒక వేళ మీరు మీకు వీలైనంత మీ ప్రచారము ద్వారా వీరందరి కొరకు శ్రమించినా,వారి సన్మార్గమును మీరు ఆశించినా,దాని కారకాలను ఎంచుకున్నా నిశ్చయంగా అల్లాహ్ మార్గభ్రష్టతకు గురి చేసిన వాడిని సన్మార్గమును అనుగ్రహించడు. మరియు వారి కొరకు అల్లాహ్ కాకుండా వారి నుండి శిక్షను తొలగించటానికి వారికి సహాయపడే వాడు ఎవడూ ఉండడు.

38

وَأَقْسَمُوا۟ بِٱللَّهِ جَهْدَ أَيْمَٰنِهِمْ ۙ لَا يَبْعَثُ ٱللَّهُ مَن يَمُوتُ ۚ بَلَىٰ وَعْدًا عَلَيْهِ حَقًّۭا وَلَٰكِنَّ أَكْثَرَ ٱلنَّاسِ لَا يَعْلَمُونَ

And they swear by Allah their strongest oaths [that] Allah will not resurrect one who dies. But yes - [it is] a true promise [binding] upon Him, but most of the people do not know.

మరణాంతర జీవితమును తిరస్కరించే వీరందరు తమ ప్రమాణాల్లో అతిశయోక్తం చేస్తూ వాటిలో శ్రమిస్తూ అల్లాహ్ మరణించేవారిని మరల లేపడని దృఢమైన ప్రమాణాలు చేశారు .దానిపై వారికి ఎటువంటి ఆధారం లేదు. ఎందుకు కాదు అల్లాహ్ తొందరలోనే మరణించే ప్రతీ వ్యక్తిని మరల లేపుతాడు. దానిపై వాగ్ధానము సత్యమైనది.కానీ చాలామందికి అల్లాహ్ మృతులను మరలా లేపుతాడన్న విషయం తెలియదు. అప్పుడే వారు మరణాంతర జీవితాన్ని తిరస్కరిస్తున్నారు.

39

لِيُبَيِّنَ لَهُمُ ٱلَّذِى يَخْتَلِفُونَ فِيهِ وَلِيَعْلَمَ ٱلَّذِينَ كَفَرُوٓا۟ أَنَّهُمْ كَانُوا۟ كَٰذِبِينَ

[It is] so He will make clear to them [the truth of] that wherein they differ and so those who have disbelieved may know that they were liars.

అల్లాహ్ వారికి వారు విభేదించే ఏకత్వము,మరణాంతర జీవితము,దైవదౌత్యము యొక్క వాస్తవికతను స్పష్టపరచటానికి,అవిశ్వాసపరులు అల్లాహ్ తోపాటు భాగస్వాములు ఉన్నారన్నతమ వాదనలో,మరణాంతర జీవిత విషయంలో తమ తిరస్కారములో అబధ్ధము పలుకుతున్నారని తెలుసుకోవాలని ప్రళయదినాన వారందరిని మరల లేపుతాడు.

40

إِنَّمَا قَوْلُنَا لِشَىْءٍ إِذَآ أَرَدْنَٰهُ أَن نَّقُولَ لَهُۥ كُن فَيَكُونُ

Indeed, Our word to a thing when We intend it is but that We say to it, "Be," and it is.

నిశ్చయంగా మేము మృతులను జీవింపచేయటమును,మరణాంతరం వారిని లేపటమును నిర్ణయించుకుంటే దాని నుండి మమ్మల్ని ఆపేవాడు ఎవడూ ఉండడు. ఏదైన విషయంను మేము నిర్ణయించుకుంటే దానితో నీవు అయిపో (కున్) అని అంటాము.అప్పుడు అది ఖచ్చితంగా అయిపోతుంది.

Commentary: Al-Mukhtasar in Interpreting the Noble Qur'an by Tafsir Center for Quranic Studies. Qur'an text and translation via AlQuran Cloud.