Muslim99Muslim99
← Tafsir library

14. Ibrahim

Abraham · Meccan · 52 ayahs

سُورَةُ إِبۡرَاهِيمَ

Reading Al-Mukhtasar in Interpreting the Noble Qur'an by Tafsir Center for Quranic Studies

Ayahs 41–50 of 52

41

رَبَّنَا ٱغْفِرْ لِى وَلِوَٰلِدَىَّ وَلِلْمُؤْمِنِينَ يَوْمَ يَقُومُ ٱلْحِسَابُ

Our Lord, forgive me and my parents and the believers the Day the account is established."

ఓ మా ప్రభువా నీవు నా పాపములను మన్నించు. మరియు నా తండ్రి పాపములను మన్నించు. (తన తండ్రి అల్లాహ్ కు బద్ధ శతృవు అని తనకు తెలవక ముందు పలికిన మాటలు ఇవి.ఎప్పుడైతే అతను అల్లాహ్ కు శతృవు అని అతనికి స్పష్టమైనదో ఆయన అతని నుండి విసుగును చూపారు). మరియు ప్రజలు తమ ప్రభువు ముందు తమ లెక్క తీసుకోవటం కొరకు నిలబడే రోజున విశ్వాసపరుల కొరకు వారి పాపములను మన్నించు.

42

وَلَا تَحْسَبَنَّ ٱللَّهَ غَٰفِلًا عَمَّا يَعْمَلُ ٱلظَّٰلِمُونَ ۚ إِنَّمَا يُؤَخِّرُهُمْ لِيَوْمٍۢ تَشْخَصُ فِيهِ ٱلْأَبْصَٰرُ

And never think that Allah is unaware of what the wrongdoers do. He only delays them for a Day when eyes will stare [in horror].

ఓ ప్రవక్తా అల్లాహ్ దుర్మార్గుల శిక్షకు గడువు ఇచ్చినప్పుడు ఆయన దుర్మార్గులు పాల్పడే కార్యాలైన తిరస్కారము,అల్లాహ్ మార్గము నుండి ఆపటం మరియు ఇతర వాటి నుండి నిర్లక్ష్యంగా ఉన్నాడని మీరు భావించకండి. కాని ఆయనకు అవి తెలుసు. వాటిలోంచి ఏది కూడా ఆయనకు గోప్యంగా ఉండదు. ఆయన మాత్రం వారి శిక్షకు ప్రళయ దినం వరకు గడువు ఇస్తున్నాడు. ఆ రోజు కళ్ళు తాము చూసిన భయానక పరిస్థితుల నుండి భయం వలన పైకి లేస్తాయి.

43

مُهْطِعِينَ مُقْنِعِى رُءُوسِهِمْ لَا يَرْتَدُّ إِلَيْهِمْ طَرْفُهُمْ ۖ وَأَفْـِٔدَتُهُمْ هَوَآءٌۭ

Racing ahead, their heads raised up, their glance does not come back to them, and their hearts are void.

అప్పుడు ప్రజలు తమ సమాదుల నుండి లేచి పిలుపునిచ్చే వారి వైపు తొందర చేస్తూ తమ తలలను పైకి ఎత్తి ఆందోళనతో ఆకాశం వైపు చూస్తూ వెళతారు. వారి చూపులు వారి వైపు మరలవు. కాని అవి వారు చూసిన భయానక పరిస్థితుల వలన విచ్చుకున్నట్లుగా ఉండిపోతాయి. వారి హృదయములు భయానక సన్నివేశము వలన అర్ధం చేసుకో లేక,గ్రహించ లేక శూన్యంగా ఉండిపోతాయి.

44

وَأَنذِرِ ٱلنَّاسَ يَوْمَ يَأْتِيهِمُ ٱلْعَذَابُ فَيَقُولُ ٱلَّذِينَ ظَلَمُوا۟ رَبَّنَآ أَخِّرْنَآ إِلَىٰٓ أَجَلٍۢ قَرِيبٍۢ نُّجِبْ دَعْوَتَكَ وَنَتَّبِعِ ٱلرُّسُلَ ۗ أَوَلَمْ تَكُونُوٓا۟ أَقْسَمْتُم مِّن قَبْلُ مَا لَكُم مِّن زَوَالٍۢ

And, [O Muhammad], warn the people of a Day when the punishment will come to them and those who did wrong will say, "Our Lord, delay us for a short term; we will answer Your call and follow the messengers." [But it will be said], "Had you not sworn, before, that for you there would be no cessation?

ఓ ప్రవక్త మీరు మీ జాతి వారిని ప్రళయదినము నాడు అల్లాహ్ శిక్ష నుండి భయపెట్టండి. అప్పుడు అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరచి,ఆయనతోపాటు సాటి కల్పించటం ద్వారా తమపై దుర్మార్గమునకు పాల్పడినవారు ఇలా పలుకుతారు : ఓ మా ప్రభువా నీవు మాకు గడువునిచ్చి ,మా నుండి శిక్షను తొలగించి, మమ్మల్ని కొంత కాలం వరకు ఇహలోకము వైపునకు మరల్చు మేము నీపై విశ్వాసమును కనబరుస్తాము.మరియు నీవు మా వైపు పంపించిన ప్రవక్తలను అనుసరిస్తాము. అప్పుడు వారిని మందలిస్తూ వారికి ఇలా సమాధానం ఇవ్వబడుతుంది : ఏమీ మీరు ఇహలోక జీవితంలో మరణాంతరం లేపబడటంను నిరాకరిస్తూ మీకు ఇహలోకము నుండి పరలోకమునకు మరలటం అన్నది లేదని ప్రమాణం చేయలేదా ?.

45

وَسَكَنتُمْ فِى مَسَٰكِنِ ٱلَّذِينَ ظَلَمُوٓا۟ أَنفُسَهُمْ وَتَبَيَّنَ لَكُمْ كَيْفَ فَعَلْنَا بِهِمْ وَضَرَبْنَا لَكُمُ ٱلْأَمْثَالَ

And you lived among the dwellings of those who wronged themselves, and it had become clear to you how We dealt with them. And We presented for you [many] examples."

మరియు మీకన్నా మునుపు అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరచి తమపై దుర్మార్గమునకు పాల్పడిన పూర్వ జాతులైన హూద్ జాతి,సాలిహ్ జాతి లాంటి వారి నివాసముల్లో మీరు నివాసమున్నారు. మేము వారిపై కలిగించిన వినాశనము మీకు స్పష్టమైనది. మరియు మేము మీరు హితోపదేశం గ్రహించటానికి అల్లాహ్ గ్రంధములో మీకు ఉపమానములను తెలియపరచాము. కాని మీరు వాటి ద్వారా హితోపదేశం గ్రహించలేదు.

46

وَقَدْ مَكَرُوا۟ مَكْرَهُمْ وَعِندَ ٱللَّهِ مَكْرُهُمْ وَإِن كَانَ مَكْرُهُمْ لِتَزُولَ مِنْهُ ٱلْجِبَالُ

And they had planned their plan, but with Allah is [recorded] their plan, even if their plan had been [sufficient] to do away with the mountains.

దుర్మార్గ జాతుల వారి నివాసముల్లో దిగిన వీరందరు ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమును హతమార్చటానికి,ఆయన సందేశ ప్రచారమును నిర్మూలించటానికి కుట్రలు పన్నారు. వారి కుట్రల గురించి అల్లాహ్ కు తెలుసు. ఆయనపై ఏది గోప్యంగా ఉండదు. వీరందరి వ్యూహము బలహీనమైనది. మరియు అది తన బలహీనత వలన వారిపట్ల ఉన్న అల్లాహ్ వ్యూహమునకు విరుద్ధంగా ఏ పర్వతమును గాని ఇతర వాటిని గాని జరపలేవు.

47

فَلَا تَحْسَبَنَّ ٱللَّهَ مُخْلِفَ وَعْدِهِۦ رُسُلَهُۥٓ ۗ إِنَّ ٱللَّهَ عَزِيزٌۭ ذُو ٱنتِقَامٍۢ

So never think that Allah will fail in His promise to His messengers. Indeed, Allah is Exalted in Might and Owner of Retribution.

ఓ ప్రవక్తా అల్లాహ్ తన ప్రవక్తలకు సహాయం చేస్తాడని,ధర్మమును ఆధిక్యతను ప్రసాధిస్తాడని తన ప్రవక్తలకు చేసిన వాగ్ధానమును నెరవేర్చడని మీరు భావించకండి. నిశ్చయంగా అల్లాహ్ ఆధిక్యుడు,ఆయనపై ఎవరు ఆధిక్యతను చూపలేరు.మరియు ఆయన తన స్నేహితులకు ఆధిక్యతను ప్రసాధిస్తాడు. తన శతృవులను,తన ప్రవక్త శతృవులను కఠినంగా ప్రతీకారం తీసుకునే వాడు.

48

يَوْمَ تُبَدَّلُ ٱلْأَرْضُ غَيْرَ ٱلْأَرْضِ وَٱلسَّمَٰوَٰتُ ۖ وَبَرَزُوا۟ لِلَّهِ ٱلْوَٰحِدِ ٱلْقَهَّارِ

[It will be] on the Day the earth will be replaced by another earth, and the heavens [as well], and all creatures will come out before Allah, the One, the Prevailing.

ఈ ప్రతీకారము అవిశ్వాసపరులకి ప్రళయదినం స్థాపతమయ్యే రోజు కలుగుతుంది.ఆ రోజు ఈ భూమి తెల్లటి,స్వచ్ఛమైన మరొక భూమిగా మార్చబడుతుంది. మరియు ఆకాశాలు వేరే ఆకాశాలుగా మార్చబడుతాయి. మరియు తన రాజరికంలో,తన మహోన్నత్యంలో ఒకే ఒక్కడైన,ఆధిక్యతను చూపేవాడు తనపై ఎవరు ఆధిక్యతను చూపని వాడు,ఓడించే వాడు,తనను ఎవరు ఓడించని వాడైన అల్లాహ్ ముందు నిలబడడానికి తమ శరీరములతో,తమ కర్మలతో తమ సమాదుల నుండి ప్రజలు బయటకు వస్తారు.

49

وَتَرَى ٱلْمُجْرِمِينَ يَوْمَئِذٍۢ مُّقَرَّنِينَ فِى ٱلْأَصْفَادِ

And you will see the criminals that Day bound together in shackles,

ఓ ప్రవక్తా మీరు చూస్తారు ఆ రోజు భూమి వేరే భూమిగా మార్చబడుతుంది మరియు ఆకాశములు మార్చబడుతాయి. అవిశ్వాసపరులు,ముష్రికులు (బహుదైవారాధకులు) ఒకరినొకరు గొలుసుల్లో బంధించబడుతారు. వారి చేతులు,కాళ్ళు గొలుసులతో వారి మెడల వైపు కట్టబడుతాయి. వారు తొడిగే వస్త్రాలు తారుతో తయారు చేయబడి ఉంటాయి (మరియు అది చాలా మండే స్వభావం కల పదార్ధం). మరియు అగ్ని వారి నల్లటి ముఖములపై క్రమ్ముకుని ఉంటుంది.

50

سَرَابِيلُهُم مِّن قَطِرَانٍۢ وَتَغْشَىٰ وُجُوهَهُمُ ٱلنَّارُ

Their garments of liquid pitch and their faces covered by the Fire.

ఓ ప్రవక్తా మీరు చూస్తారు ఆ రోజు భూమి వేరే భూమిగా మార్చబడుతుంది మరియు ఆకాశములు మార్చబడుతాయి.అవిశ్వాసపరులు,ముష్రికులు (బహుదైవారాధకులు) ఒకరినొకరు గొలుసుల్లో బంధించబడుతారు.వారి చేతులు,కాళ్ళు గొలుసులతో వారి మెడల వైపు కట్టబడుతాయి.వారు తొడిగే వస్త్రాలు తారుతో తయారు చేయబడి ఉంటాయి (మరియు అది చాలా మండే స్వభావం కల పదార్ధం).మరియు అగ్ని వారి నల్లటి ముఖములపై క్రమ్ముకుని ఉంటుంది.

Commentary: Al-Mukhtasar in Interpreting the Noble Qur'an by Tafsir Center for Quranic Studies. Qur'an text and translation via AlQuran Cloud.