Muslim99Muslim99
← Tafsir library

12. Yusuf

Joseph · Meccan · 111 ayahs

سُورَةُ يُوسُفَ

Reading Al-Mukhtasar in Interpreting the Noble Qur'an by Tafsir Center for Quranic Studies

Ayahs 1–10 of 111

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ

1

الٓر ۚ تِلْكَ ءَايَٰتُ ٱلْكِتَٰبِ ٱلْمُبِينِ

Alif, Lam, Ra. These are the verses of the clear Book.

{అలఫ్-లామ్-రా} సూరతుల్ బఖరహ్ ఆరంభంలో వీటి సారుప్యంపై చర్చ జరిగింది.ఈ సూరహ్ లో అవతరించబడిన ఈ ఆయతులు సుస్పష్టమైన ఖుర్ఆన్ ఆయతులు అందులో పొందుపరచబడి ఉన్నవి.

2

إِنَّآ أَنزَلْنَٰهُ قُرْءَٰنًا عَرَبِيًّۭا لَّعَلَّكُمْ تَعْقِلُونَ

Indeed, We have sent it down as an Arabic Qur'an that you might understand.

ఓ అరబ్బులారా నిశ్చయంగా మేము ఖుర్ఆన్ ను అరబీ భాషలో అవతరింప జేశాము బహుశా మీరు దాని అర్ధాలను అర్థం చేసుకుంటారని.

3

نَحْنُ نَقُصُّ عَلَيْكَ أَحْسَنَ ٱلْقَصَصِ بِمَآ أَوْحَيْنَآ إِلَيْكَ هَٰذَا ٱلْقُرْءَانَ وَإِن كُنتَ مِن قَبْلِهِۦ لَمِنَ ٱلْغَٰفِلِينَ

We relate to you, [O Muhammad], the best of stories in what We have revealed to you of this Qur'an although you were, before it, among the unaware.

ఓ ప్రవక్తా మేము ఉత్తమమైన గాధలను వాటి నిజాయితీ వలన,వాటి పదాల భద్రత,వాటి సమగ్రత వలన ఈ ఖుర్ఆన్ ను మా అవతరణ ద్వారా మీకు తెలియపరచాము.మరియు నిశ్చయంగా మీరు దీని అవతరణ ముందు ఈ గాధల నుండి పరధ్యానంలో ఉన్నారు.వాటి గురించి మీకు తెలియదు.

4

إِذْ قَالَ يُوسُفُ لِأَبِيهِ يَٰٓأَبَتِ إِنِّى رَأَيْتُ أَحَدَ عَشَرَ كَوْكَبًۭا وَٱلشَّمْسَ وَٱلْقَمَرَ رَأَيْتُهُمْ لِى سَٰجِدِينَ

[Of these stories mention] when Joseph said to his father, "O my father, indeed I have seen [in a dream] eleven stars and the sun and the moon; I saw them prostrating to me."

ఓ ప్రవక్తా మేము మీకు యూసుఫ్ తన తండ్రి యాకూబ్ తో ఇలా పలికిన వేళను తెలియపరుస్తున్నాము : ఓ నా ప్రియ తండ్రి నిశ్చయంగా నేను కలలో పదకొండు నక్షత్రాలను చూశాను మరియు నేను సూర్యుడిని,చంద్రుడిని చూశాను.నేను వాటన్నింటిని నాకు సాష్టాంగ పడుతున్నట్లు చూశాను.అయితే ఈ కల యుసుఫ్ అలైహిస్సలాము కొరకు తొందరగా ఇవ్వబడిన శుభవార్త అయినది.

5

قَالَ يَٰبُنَىَّ لَا تَقْصُصْ رُءْيَاكَ عَلَىٰٓ إِخْوَتِكَ فَيَكِيدُوا۟ لَكَ كَيْدًا ۖ إِنَّ ٱلشَّيْطَٰنَ لِلْإِنسَٰنِ عَدُوٌّۭ مُّبِينٌۭ

He said, "O my son, do not relate your vision to your brothers or they will contrive against you a plan. Indeed Satan, to man, is a manifest enemy.

యాఖూబ్ తన కుమారుడగు యూసుఫ్ తో ఇలా పలికారు : ఓ నా ప్రియ కుమారా నీవు నీ కలను నీ సోదరులకు తెలియపరచకు అప్పుడు వారు దాన్ని అర్ధం చేసుకుంటారు. మరియు వారు నీ పై అసూయ చెందుతారు.అప్పుడు వారు తమ అసూయతో నీ కొరకు కుట్రలు పన్నుతారు . నిశ్చయంగా షైతాను మానవుని కొరకు స్పష్టమైన శతృవు.

6

وَكَذَٰلِكَ يَجْتَبِيكَ رَبُّكَ وَيُعَلِّمُكَ مِن تَأْوِيلِ ٱلْأَحَادِيثِ وَيُتِمُّ نِعْمَتَهُۥ عَلَيْكَ وَعَلَىٰٓ ءَالِ يَعْقُوبَ كَمَآ أَتَمَّهَا عَلَىٰٓ أَبَوَيْكَ مِن قَبْلُ إِبْرَٰهِيمَ وَإِسْحَٰقَ ۚ إِنَّ رَبَّكَ عَلِيمٌ حَكِيمٌۭ

And thus will your Lord choose you and teach you the interpretation of narratives and complete His favor upon you and upon the family of Jacob, as He completed it upon your fathers before, Abraham and Isaac. Indeed, your Lord is Knowing and Wise."

మరియు ఏ విధంగా నైతే నీవు ఈ కలను చూశావో ఓ యూసుఫ్ నీ ప్రభువు నిన్ను ఎన్నుకుంటాడు.మరియు నీకు కలల తాత్పర్యమును నేర్పుతాడు,మరియు ఆయన దైవదౌత్యము ద్వారా నీపై తన అనుగ్రహమును సంపూర్ణం చేస్తాడు. ఏవిధంగానైతే ఆయన నీ కన్నా మునుపు నీ తాతముత్తాతలైన ఇబ్రాహీమ్,ఇస్ హాఖ్ లపై తన అనుగ్రహమును సంపూర్ణం చేశాడో ఆవిధంగా.నిశ్చయంగా నీ ప్రభువు తన సృష్టి గురించి బాగా తెలిసినవాడు,తన కార్య నిర్వహణలో వివేకవంతుడు.

7

۞ لَّقَدْ كَانَ فِى يُوسُفَ وَإِخْوَتِهِۦٓ ءَايَٰتٌۭ لِّلسَّآئِلِينَ

Certainly were there in Joseph and his brothers signs for those who ask,

వాస్తవానికి యూసుఫ్ యొక్క సమాచారములో.ఆయన సోదరుల సమాచారములో వారి సమాచారముల గురించి అడిగే వారి కొరకు గుణపాఠాలు,హితబోధనలు కలవు.

8

إِذْ قَالُوا۟ لَيُوسُفُ وَأَخُوهُ أَحَبُّ إِلَىٰٓ أَبِينَا مِنَّا وَنَحْنُ عُصْبَةٌ إِنَّ أَبَانَا لَفِى ضَلَٰلٍۢ مُّبِينٍ

When they said, "Joseph and his brother are more beloved to our father than we, while we are a clan. Indeed, our father is in clear error.

ఆయన సోదరులు వారి మధ్యలో ఇలా అనుకున్నప్పుడు : నిశ్చయంగా యూసుప్ మరియు అతని సొంత సోదరుడు మా తండ్రి వద్ద మా కన్నా ఎక్కువ ఇష్టత కలిగిన వారు.వాస్తవానికి మేము ఎక్కువ సంఖ్య గల వర్గము.అయితే ఆయన వారిద్దరిని మన కన్నా ఎక్కువ యోగ్యులుగా ఎలా భావిస్తున్నారు ?.నిశ్చయంగా మా నుండి ఎటువంటి కారణం స్పష్టం కాకుండానే ఆయన వారిని మా కన్నా ఎక్కువ యోగ్యులుగా భావించినప్పడు మేము ఆయనను స్పష్టమైన తప్పులో చూస్తున్నాము.

9

ٱقْتُلُوا۟ يُوسُفَ أَوِ ٱطْرَحُوهُ أَرْضًۭا يَخْلُ لَكُمْ وَجْهُ أَبِيكُمْ وَتَكُونُوا۟ مِنۢ بَعْدِهِۦ قَوْمًۭا صَٰلِحِينَ

Kill Joseph or cast him out to [another] land; the countenance of your father will [then] be only for you, and you will be after that a righteous people."

మీరు యూసుఫ్ ను హతమార్చండి లేదా అతన్ని దూర ప్రదేశంలో తీసుకెళ్ళి అదృశ్యం చేయండి అప్పుడు మీ తండ్రి ముఖము మీ కోసం ప్రత్యేకమైపోయి ఆయన మిమ్మల్ని సంపూర్ణంగా ప్రేమిస్తారు.మీరు అతన్ని హతమార్చి లేదా అతన్ని అదృశ్యం చేసి తరువాత మీరు మీ పాపమునకు పశ్చాత్తాప్పడినప్పుడు మీరు సద్వర్తనులుగా అయిపోతారు.

10

قَالَ قَآئِلٌۭ مِّنْهُمْ لَا تَقْتُلُوا۟ يُوسُفَ وَأَلْقُوهُ فِى غَيَٰبَتِ ٱلْجُبِّ يَلْتَقِطْهُ بَعْضُ ٱلسَّيَّارَةِ إِن كُنتُمْ فَٰعِلِينَ

Said a speaker among them, "Do not kill Joseph but throw him into the bottom of the well; some travelers will pick him up - if you would do [something]."

సోదరుల్లోంచి ఒకడు ఇలా పలికాడు : మీరు యూసుఫ్ ను హతమార్చకండి.కాని అతన్ని మీరు ఏదైన లోతైన బావిలో పడవేయండి అతని వద్ద నుండి వెళ్లే ప్రయాణికుల్లోంచి ఎవరైన అతన్ని ఎత్తుకుంటారు.ఇది నష్టం కలిగించటానికి అతన్ని హతమార్చటం కన్నాచాలా తేలికైనది.ఒక వేళ మీరు అతని విషయంలో చెప్పిన దాన్ని చేయటంపై దృడ నిర్ణయం చేసుకుని ఉంటే (చేయండి).

Commentary: Al-Mukhtasar in Interpreting the Noble Qur'an by Tafsir Center for Quranic Studies. Qur'an text and translation via AlQuran Cloud.